ధర్మసందేహాలు

సుభద్ర కృష్ణుని చెల్లెలు ఎలాగైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సుభద్ర శ్రీకృష్ణునకు చెల్లెలెలా అయింది?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై
సుభద్ర వసుదేవునికి రోహిణి అనే భార్య యందు పుట్టిన పుత్రిక. కనుక సుభద్ర శ్రీకృష్ణునకు చెల్లెలయింది.
* లక్షవత్తుల నోము ఎలా నోచుకోవాలి? - ప్రణవి,
ఇది చాలా పెద్ద కల్పము. భక్తులైనవారు స్వయంగా లక్ష దీపపు వత్తులను తయారుచేసుకుని, నారాయణ మంత్రము లక్ష సంఖ్యగా జపించి విత్తానుసారంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఇతర వివరాలను స్థానిక పురోహితుల వద్ద తెలుసుకోగలరు.
* శ్రీకృష్ణుని చుట్టి ఉండే రాజకన్యలందరూ మహర్షూలంటారు నిజమేనా? - నీలవేణి గూడూరు
పూర్వం రామావతారంలో కొందరు మహర్షులు శ్రీరామ సౌందర్యానికి సమ్ముగ్ధులై శ్రీ రాముని ఆలింగనాన్ని కోరారు. అపుడు శ్రీరాముడు ప్రసన్నుడై ఈ అవతారంలో అది సాధ్యంకాదని, పై కృష్ణావతార సమయానికి ఈ మహర్షులంతా గోపికలుగా, రాజకన్యలుగా జన్మిస్తారని, అపుడు వారి కోరిక తీరుతుందని, వరమిచ్చాడని గర్గ భాగవతాది గ్రంథాలలో వుంది.
* నేను వృద్ధుడను. మోకాళ్ల నొప్పులు. క్రింద కూర్చోలేను. శ్రీ సత్యనారాయణ వ్రతము ఇతర అనుష్ఠానాలు చేసుకునేందుకు విధానమేదైనా వున్నదా?
- నాళం వెంకట రమణరావు, రాజమండ్రి
క్రింద కూర్చోనవటానికన్నా అనుష్ఠాన ఆచరణే ముఖ్యం. కనుక కుర్చీ పీటవంటి ఎతె్తైన ఆసనాలమీద కూర్చుని, దేవుడ్ణికూడ టీపాయి వంటి ఎతె్తైన ఆసనాల మీదే కూర్చుండబెట్టి, అన్ని అనుష్ఠానాలు చేతనైనంతవరకు మానకుండా చేసుకోవటమే ఉత్తమము.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org