Others

ఆచరణతోనే ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకమంది దేవతారాధన చేయాలని దేవతలను మెప్పించాలనివారి అను గ్రహం పొందాలని దీక్ష వహించి పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తుంటారు. ఇంకొం దరు ఎక్కడ మహిమలను బహిర్గతమవు తున్నాయని అంటే అక్కడికి వెళ్తుంటారు. దేవాలయా లకు వెళ్లి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తుంటారు. తండోప తండాలుగా దేవాలయాలకు వచ్చే భక్తులనో, లేక పుణ్యక్షేత్రాల కు వెళ్లేవారినో చూస్తే భక్తి మానవుల్లో ఎంతగా పెరిగి పోయందో అనిపిస్తుంది. కాని దుర్మార్గాలు ఈ కాలంలోనే పెచ్చుమీరుతున్నాయ. ఒకరి సంపదను మరొకరు దోచుకుంటున్నారు. బలవంతులు బలహీనులను అణిచే ప్రయత్నంలో ప్రాణాలను కూడా తీసేస్తు న్నారు. ఇంత భక్తి ఉంటే మరి ఇట్లాంటి దురాగతాలు ఎందుకు జరుగు తాయనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేస్తున్నది ఒకటైతే చెప్పేది మరొకటి అవుతోంది. కాని భగవంతుడు తన్ను ప్రశంసించే నోటిని చూచినట్లే ప్రాణి కోటిపట్ల చేసే చేతను కూడా గమనిస్తాడు. అందుకే ప్రకృతి వైపరీత్యాలు కలుగుతుంటాయ. అందుకే మనం ఏది చెప్తామో దానే్న చేయాలి. ఆచరణతో కూడిన ధర్మానికి మంచి ఫలితం ఉంటుంది. కృష్ణుడు తాను ధర్మం చేయ డమే కాదు నలుగురిచేత చేయంచాడు. అధర్మం ఎక్కడ కనపడినా దాన్ని నయానో భయానో అరికట్టాడు. అందుకనే మనం అన్యాయం చేయకుండా ఉండడమే కాదు ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఆపే శక్తిని కూడా మనం కలిగిఉంటే ప్రపంచమొత్తం నీతినియమాలతో కూడిన ధర్మరాజ్యం అవుతుంది. రామరాజ్యం అవుతుంది.

- సత్య