Others

ధ్యానం..ఆనందానికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ విధమైన చాంచల్యము లేక మనస్సును నిర్మలంగా ఉంచుకొని దేవుని మదిలో తలచుటయే ధ్యానము. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ధ్యానమనేది యాంత్రిక జీవన ప్రక్రియ కాకూడదు. ధ్యానము నిత్యనూతన సముజ్వల కాంతి పుంజమై భాసించాలి. మనసు మనలను యాతనకు గురిచేస్తుంది. మనో నిగ్రహము లేని మానవుడు, ధ్యానమును ఎంత మాత్రము కొనసాగించలేడు. మనకు స్వాధీనమైన మనస్సు స్వాత్మదర్శనానికి సహకరిస్తుంది. చంచలమైన మనస్సును నిగ్రహించుట ఎంతో ఎంతో కష్టము. మనోనిగ్రహము అభ్యాస వైరాగ్యముల ద్వారానే సాధించవలసి యుండును. వ్యక్తికి అనుష్ఠానానికి సంబంధించిన ఆత్మ సంయమము అత్యంత అవసరము. ధ్యానము ద్వారానే అంతఃకరణము శుద్ధియై మనస్సు నిర్మలమగుతుంది. మానవుడు బాహ్యమునందలి వస్తువులతో, వ్యక్తులతో ముడివడి వ్యక్తి బహిర్ముఖుడగుతున్నాడు. ఎన్నో ఎనె్నన్నో బంధాల పెనుగులాటలో బహిర్గతమయ్యే మనం యదార్థానికి అంతరంగ వాసులమే అయియున్నాము. అంతర్యములలో మనుగడ కలిగిన మనము ఒక్క క్షణమైనను అంతరంగికానుభూతిని అనుభవించలేకపోతున్నాము. మన కాలమంతా వ్యక్తులకు, వస్తు సముదాయములకు మాత్రమే కేటాయిస్తున్నాము. కాని మనలో మనం భాషించుకొనేందుకు మనలను మనం చూచుకొనేందుకు మాత్రం ఉపకరించుకొనడం లేదు. అసలు వ్యక్తి తనలో తానుండి తనను తానుగా చూచుకునేందుకు ఉపక్రమించాలి. అందుకు అలవాటు పడాలి. కేవలం ధ్యానము మాత్రమే ఈ అలవాటును మనకు అందిస్తుంది. ధ్యానమును గూర్చి తెలుపునదియే ధ్యానయోగము. భగవానుడు గీతలో ఈ ధ్యాన యోగము గురించి పార్థునకు చక్కగా విశదపరచాడు. ధ్యానయోగమంటే తెలిసిన దాని నుండి తెలియనిదానిని తెలిసికొనుటకు చేసే ప్రయత్నమే ధ్యానయోగము. యత్నించేది పరిమితమైన మనస్సు. లభించేది అపరిమితమైన ఆత్మ సంతోషం. మనస్సు ఆత్మకు దగ్గరైన కొలది ఆత్మ మనస్సునకు బంధువగుతుంది. అయితే మనస్సు మన కల్పిత భావాలకు బానిసయై సత్యావగాహన పొందలేని దుర్దశకు గురియైనపుడు ఆత్మ శత్రువగుతుంది. అయితే ఆత్మ బంధువుగా కావాలంటే అవగాహన పూర్ణ స్వరూపంగా మారాలి. పరమాత్ముడు అర్జునునకు ఈ విషయానే్న అవగాహన చేస్తాడు. తనకు తానే బంధువు. తనకు తానే శత్రువు అని హెచ్చరిస్తాడు. మనలను మనం ఆనంధంగా దర్శించుకొని తృప్తిచెందే అంతరంగికానుభూతి. ధ్యానయోగానికి సంబంధించిన అనేక వినూత్న విధానాలను భగవానుడు గీతలోని ఆత్మ సంయమ యోగములో చక్కగా విశదపరచాడు. త్రికరణశుద్ధితో భగవంతుని నమ్మినవారిని ఆయన ఎన్నడూ దూరం చేయడు. ఆయననే తదేకంగా ధ్యానించువారిని ఆయన తదేకంగా చూస్తాడు. ధ్యాన సమయంలో మననం చేస్తున్నదేమిటో అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో భగవానుని అపార కృపా జలధిలో మునిగేందుకు ప్రయత్నించాలి. అందుకు మనస్సు అనుగుణంగా ఉండాలి. ప్రశాంతతను ఊతంగా చేసికొని శాంతి సదనానికి తరలిపోవాలి.

-పెండెం శ్రీధర్