ధర్మసందేహాలు

సువాసినీ అర్చనే దేవీపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఋషి సంప్రదాయం అంటే ఏమిటి?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై
మహర్షులు రచించిన ఉపాసనా ధర్మశాస్త్రాది గ్రంథాల ద్వారా సంక్రమించిన ఆచార వ్యవహార విధానాలను గానీ ఉపాసనా విధానాలుగానీ ఋషి సంప్రదాయము అంటారు.
* ప్రకృతి పూజలు అంటే ఏమిటో వివరించండి
- లక్ష్మి, హైదరాబాదు
మనం ఉపాసన చేసే దేవతను కేవలం విగ్రహ మాత్రంగా కాకుండా, ఆ దేవత ప్రకృతి మొత్తాన్ని వ్యాపించి ఉన్న అఖండమూర్తి భావిస్తూ జపపూజా హోమాదులను నిర్వర్తిస్తే అది ప్రకృతి పూజ అనబడుతుంది.
* దేవాలయాల్లో చేసే కుంకుమ పూజ ఇంట్లో చేసే విగ్రహారాధన గురించి వివరించండి రామమోహన్ , సూర్యాపేట
సామాన్యంగా గుళ్లల్లో చేసే కుంకుమ పూజలన్నీ శ్రీచక్రం మీద చేస్తూ ఉంటారు. లేదా దేవతావిగ్రహం మీద చేస్తూ ఉంటారు. ఎలా చేసినా ఆ దేవిని ప్రకృతి సర్వవ్యాపక మూర్తిగా భావన చేస్తూ పూజలను చేస్తే అవి ప్రకృతి పూజలు అవుతాయి. ఒక రూపానికి పరిమితమైన దేవతామూర్తిగా భావన చేస్తూ పూజ చేస్తే అవి దేవతాపూజలౌతాయి.
*సువాసినీ పూజ ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తారు? ఆ పూజావిధానం ఏమిటి?
రమణమ్మ, విజయవాడ
విశాలమైన దేవీ పూజలో ఒక అంగమే సువాసినీ పూజ. ఆ దేవీ పూజకు ఏమి ప్రయోజనమో ఈ సువాసినీ పూజకూ అదే ప్రయోజనం. ఏ దేవిని మనం ఆరాధిస్తున్నామో ఆ దేవి యొక్క ప్రత్యక్ష సచేతన స్వరూపంగా ఈ సువాసిని (ముతె్తైదువను) భావన చేస్తూ ఆర్ఘ్యపాద్యాదులు అందించటమే ఈ విధానంలోని అంతసూత్రం.
* తాను నమ్మిన దేవత సర్వశక్తి సంపన్నుడన్న నమ్మకంతో పూజిస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఇతర దేవతా పటాల్ని కూడా ఉంచి పూజించవచ్చా?
- బి. లక్ష్మీనారాయణ, నందిగామ
అన్ని బాధ్యతలనుంచి చివరకు తన శరీర బాధ్యతను కూడా వదిలి పెట్టినవాడే స్వామిజీ. కానీ ఆ సమున్నత స్థాయికి చేరిన అవ్యాత్ములలో కొందరు తామే ఆధ్యాత్మిక తిరుగు ప్రయాణంలో కొన్ని సాంఘిక బాధ్యతలను ఐచ్ఛికంగా స్వీకరించడం అనాది కాలంగా కనిపిస్తోంది. రామాయణంలో వసిష్ఠ మహర్షి, మహాభారతంలో వ్యాసమహర్షి అలాంటివారే.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి