Others

స్వీయ గమనికతోనే స్వానుభవ అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను-నేను అంటూ ఒక నేను తలంపు స్వానుభవంలో ఉండుట అందరికి సహజ ప్రమాణమే. ఈ నేనుయే నేనును తెలుసుకొనుటకు ఆలంబనము. కనుక ఈ స్వీయ గమనికలో తర్కవాద సాధన విశ్వాసము శాస్తమ్రుల ప్రసక్తి అవసరం లేదు. ఈ ‘నేను’ యొక్క స్వీయ సాక్షీజ్ఞాన, సంకల్పాది విశిష్ట గుణములను బోధ సూచనాదులతో, స్వానుభవ ప్రమాణముతోనే అవగాహన కలిగి, నేను స్పృహ కలిగి, తనను తానే సూటిగ, స్పష్టంగ, సహజంగ స్వీయ సాక్షీజ్ఞానాదులతో యధాతథంగా స్వీయ గమనిక కలిగియుండవలెను. స్వీయ సాక్షీజ్ఞాన సహజ స్వీయ గమనికలో బోధ సూచనాదులతో స్వానంద వౌనము సహజమసను స్వతఃసిద్ధమగును. స్వానందవౌన స్వీయగమనికలో ఈ నేను తలంపుకు పట్టులేక, నిలువ నీడలేక, తనను తానే వీడును. అదృశ్యమగును. పూర్ణవౌనమే సహజమగును.
‘నా కృప’ అనగా నేనును యథాతథ స్మృతి చేయు ‘నేను’ బోధ సూచనాదులే అని మరువరాదు.
స్వానుభవ అవగాహన ఓ మాయ
ఈ స్వానుభవ అవగాహన ప్రబోధ విధానముతో మాయ నిర్ధారణ ప్రత్యేకించి అనవసరము. ‘నేను ఉన్నాను’ అను తలంపే మాయ. నేను అజ్ఞానిని అనుటయే ప్రమాణము.
‘నేను’ తన సహజ విశిష్ట గుణములను స్వానుభవములో సహజంగా ఎట్లు కలిగి యున్నదో అట్టి విధంగా యథాతథ అవగాహన కలిగి ఆ విశిష్ట గుణములతోనే ‘తనను’తానే గమనించి యుండుటయే ప్రధానము.
ఈ స్వానుభవ అవగాహన పద్ధతిలో ‘నేను’ తన యదార్థ స్వానంద వౌనము గుర్తించుటయే ‘నేను’ అనెడి తలంపు ప్రతిబంధకము కాదు. కనుక ప్రత్యేకించి ఈ ‘నేను’ను అహంకారమని, నశింపు చేయుట, తొలగించుట, తప్పించుకొనుట మొదలగు పద్ధతులవలె ప్రయాస పడనక్కరలేదు. అట్లని ‘నేను’ ప్రత్యేకించి ఆనందానే్వషణ చేయుట గాని, నేను ఆనందమని భావించుట గాని, ఈ స్వానుభవ అవగాహన ప్రబోధ విధానము కాదు.
స్వానుభవ అవగాహన
నేను-నేను అనెడి తలంపు ఉండుట అందరికి వాద తర్కములతో పనిలేని స్వానుభవ ప్రమాణము. ఈ నేను ఉన్నాను అనుట చేతనే తనను తాను గమనించుట చేతనే, సహజ ఉనికి సాక్షిగా ఉన్నది. తనను తానే అనుభవించి తెలుసుకొనుట చేత జ్ఞాన స్వరూపముగా ఉన్నది. ‘నేను-నేను’ అనుటతో సంకల్ప స్వరూపముగానే ఉన్నది. స్వీయ సంకల్ప కదలికలను సహజంగా కలిగి యుండుటచే అణు పదార్థముగాను (పదార్థమునకే చలనాదులు ఉండును) తనకు తానే ‘నేను’ అంటూ ఎడమ నిచ్చుచూ అవకాశ స్వరూపమై ఆకాశ స్వరూపముగా ఉన్నది.
తన్ను తానే, తనయందే తనను సర్వముగా, సర్వరహితంగా, విషయి విషయ స్వరూపముగా ఉండి సహజంగా అనేక రీతి పోకడలలో అనుభవించుచున్నది. నేను మరచితిని, నాకు స్మృతి కలిగినది- అనుటలోనే నేనుకు ఎరుక, మరుపులే స్వరూపముగానే ఉన్నాయి. ఈ విధముగా నేను తోటి తోచు సర్వము కూడ ‘నేను’ యందే గలదనుటకు ఈ నేనుయు ప్రమాణము. కనుక నేను తనను తానే సర్వముగా, సహజముగా అనుభవించుట కూడ ప్రబోధ సూచనాదులతో అవగాహన కలిగియుండుట ముఖ్యము. నేను తన్నుతానే గమనించుట చేతనే సదాసాక్షిగానే ఉన్నది. సాక్షి ఎట్టి విధముగా అనుభవములో సదా ఉన్నదో, అట్టి విధముగానే ఉన్నది. సాక్షీజ్ఞాన స్వరూపముగానే ఉన్నది. అనగా నేను అను తలంపు సహజముగానే నిశ్చల సాక్షీ జ్ఞాన స్వరూపముగానే ఉన్నదని, ‘నా కృప’ సూచనాదులతో సహజముగా గమనించినంతనే స్వానందవౌనము సహజమగును.
నేను-నేను అనెడి సంకల్పము తనకు తానే అణు స్వరూపముగా ఉంటొనే స్వీయ సహజ కదలికచే శబ్ద స్వరూపముగా నుండుట, స్వానుభవ అవగాహన ప్రబోధ సూచనాదులతో స్వీయ సాక్షీజ్ఞానంతో గమనించినంతనే, స్వానందవౌనము సహజమగును. నేను-నేను అంటూనే తనకు తానే ఎడము కలిగి, అవకాశ స్వరూపమై అవకాశముగా ఉన్నదనుట, స్వీయ సాక్షీజ్ఞానముతో గమనించినంతనే స్వానందవౌనం సహజమగును. స్వానుభవ అవగాహన ప్రబోధ సూచనాదులతో ‘నేను’ స్మృతి కలిగి ‘నేను’ను ఎట్టి విధముగా కమనించిననూ స్వానంద వౌనం సహజమగును. ఇక ‘నా కృప’ యగు స్వానంద వౌన అనుభవ గమనికలో ‘నేను’ తలంపుకు పట్టులేక, నిలువ నీడలేక తనకు తానే వీడును. అదృశ్యమగును. తుట్టతుదకు వౌనమే సహజమగును. ఇదియే స్వానుభవ అవగాహన ప్రబోధ విధానము. క్లుప్తముగా, నేను అంటే... పరిపూర్ణ ఉనికి, వౌన, ఆనంద స్వరూపమే. అజ్ఞానమే కారణమని వేదాంతము యొక్క అభిప్రాయమువలన, నేనుకు అజ్ఞానమున్నదని స్పష్టమైంది. పరిపూర్ణ వౌనం నేను-నేను అని అనదు. పరిపూర్ణ వౌనం దేనికి అవకాశం ఇవ్వదు. నేను ఉన్నాను అనెడి ఈ నేనుయే ప్రశ్నిస్తున్నది. ఈ నేను ఎట్టి విధంగా ఉన్నదో అట్టి విధంగా యథాతథా గమనించుటయే స్వానుభవ అవగాహన ప్రబోధ విధానము.ప్రత్యేకించి మాయ, అజ్ఞానము వేరుగా ఉన్నదని, లేదనియు కూడ ఈ నేను చెప్పుచున్నది. ఇవన్నియు అప్రసక్తము. ఈ నేను సంకల్పమునకు ఈ నేనుయే ఆలంబనము. స్వీయ సాక్షీజ్ఞాన ప్రమాణముతోనే ‘నేను-నేను’ అని అంటుంది. ఈ నేనుకు స్వానుభవ అవగాహన ప్రబోధ సూచనాదులతో, స్వీయ సాక్షీజ్ఞాన సంకల్పాది విశిష్ట లక్షణములు కలిగిన పదార్థముగా, స్వానుభవముతోనే అవగాహన కలుగాలి.

- వేదాంతం ఉపేంద్రశర్మ