ధర్మసందేహాలు

సామవేదానికి గాన సందర్భం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వివాహంలో చదివే మంత్రాలు ఏ వేదం నుంచి తీసుకోబడినివి?
- ఎస్.నాగరాజు, గుంటూరు
ఒక్కొక్క కుటుంబంవారికి ఒక్కొక్క వేదమనే వ్యవస్థను మహర్షులు ఏర్పాటుచేశారు. వారి వారి వివాహాది కర్మలలో వారి శాఖకు సంబంధించిన వేదమంత్రాలు ఎక్కువగా వుంటాయి. ఇదిగాక ఇతర వేద శాఖల నుంచి కూడా అనేక మంత్రాలను తీసుకోవలసి వుంటుంది. వీటిని పరాయాత మంత్రములు అంటారు. వీటిని సూత్రకర్తలైన మహర్షులే నిర్ణయిస్తారు.
* నమకం చమకం అంటే ఏమిటి? - శివరావు, హైదరాబాదు
శ్రౌతయాగాలలో అగ్ని చయనము అనే యాగము ఒకటి వుంది. దాని పతాక స్థాయిలో వినియోగించే మంత్రాలనే నమకము, చమకము అంటారు. ఇవి యుజర్వేద మంత్రాలు. వీటినే శివాభిషేకంలో కూడా వినియోగించవచ్చునని బోధాయన మహర్షి చెప్పారు. ఈ మంత్రాలవల్ల అగ్ని, ఇంద్ర, పరమేశ్వర దేవతాప్రీతి లభిస్తుంది.
* భారతదేశంలో వివాహం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతోంది. ఎందువలన? - ఎస్.పెంచలయ్య, గుంటూరు
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి గోత్ర ఋషులు, సూత్ర ఋషులు అని వుంటారు. వీరిలో సూత్రఋషులు సామాన్యంగా ప్రాంతాలను బట్టి మారుతూ వుంటారు. ఈ సూత్రఋషులే వివాహాది విధానాలను నిర్ణయిస్తారు. ఈ ప్రాంతీయ భేదాలను బట్టే వివాహ విధానాలలో భేదాలు కనిపిస్తూ వుంటాయి. పరిశీలించి చూస్తే అన్నిటిలోనూ వున్న అంతస్సూత్రం ఒకటే.
* సామవేదాన్ని ఏ సందర్భంలో గానం చేస్తారు. ఏ రాగంలో గానం చేస్తారు? వీటిని మనం ఎప్పుడు వినవచ్చు - ఎస్.రమణి గుంటూరు
సామవేదాన్ని ప్రధానంగా యజ్ఞక్రతువులలో దేవతాస్త్రోత్ర సందర్భాలలో గానం చేస్తారు. ఈ వేదం యాగాల ఉత్పత్తి కంటే వెనుకటిది కనుక, ఈ రాగాలు ఈ నాటి సంగీత శాస్త్రాన్ని అనుసరించి వుండవు. వీటిని పవిత్రంగా వున్న సమయంలో మనం వినవచ్చు.
* వేదాశ్వీరచనం అంటే ఏమిటి? ఏ వేదం ద్వారా ఆశీర్వచనం చేస్తారు?
- సి.రవికుమార్, గుంటూరు
అర్థానికి మాత్రమే కాకుండా శబ్ద తరంగాలకు కూడా విశేష భక్తి వుండడమే వేదాలలోని ప్రత్యేకత. ఈ వేద శబ్దాల శక్తిని ఎదుటివారి మేలుకోసం ఉపయోగించే విధానాలను మహర్షులు గుర్తించారు. ఆ విధానాల ద్వారా వేద మంత్రపఠనం చేసి శ్రోతలకు శుభం కలిగించటానే్న వేదాశీర్వచనము అంటారు. ఈ ఆశీర్వచనానికి నాలుగు వేదాలలోని మంత్రాలు కూడా ఉపయోగపడతాయి.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి