Others

మధురం మధురాక్షరం శ్రీరామనామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేఘచ్ఛాయబోలుదేహంకలవాడు. ఆజానుబాహుడు. పుంసాం మోహన రూపాయ... గొప్పరూపవంతుడు.గొప్ప గుణవంతుడు కోట్లాది పున్నమి చంద్రులకు సమానమైన కాంతివంతమగుమోము కలవాడు. సత్వగుణప్రధానుడు. ఇలా పదహారు శుభలక్షణాలతో ఒప్పారువాడు శ్రీరాముడు. దశరథుడు ఎన్నో పుణ్యకర్మలు, యజ్ఞయాగాది కార్యాలు చేసి భగవంతుని పుత్రుని రూపంలో శ్రీరాముడిని పొందాడు. పుట్టినప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కనులు మూసినా తెరిచినా శ్రీరాముని రూపానే్న కనులనింపుకుని బతికేవాడు దశరథుడు.
త్రేతాయుగపు రాముడైనా కలియుగంలో రామ అని చింతించినంతనే పాపాలను దూరంచేసేవాడే ఆ రాముడే. సీతామనోహరుడు నాడు రాక్షసులను దునుమాడాడు. నేడు రాముని అనుక్షణం స్మరించినవారికి వారి లోపల ఉండే దుష్టచింతనలనే రాక్షసులను దునుమాడే శక్తినిచ్చేవాడు ఆ రాముడే. భక్తజన సంరక్షకుడు. సకలార్థసిద్ధిని కలుగచేసేవాడు రాముడు కనుక సర్వవేళలా సర్వావస్థల యందు శ్రీరాముని నామాన్ని స్మరించేవారు కోకొల్లలుగా ఉంటారు.
భ్రమరకీటక న్యాయం ప్రకారం శ్రీరాముడినే తలుస్తూ రాముని ప్రవర్తననే చింతిస్తూ రాముని మాటలనే స్మరిస్తూ ఉంటే నేటి మానవులుగా రామునికి మారుపేరుగా మారుతారంటారు పెద్దలు.
ఒకసారి రాముని చూచినంతనే, రాముని తలిచినంతనే ఆనందాన్ని ఏవిధంగా పొందుతున్నారో అందరూ ఆ విషయం ఏమిటని పార్వతీదేవి పరమశివుడిని అడిగిందట. అపుడా శివుడు రామ అన్న నామంలోని రహస్యమే అది. నేను కూడా ఆ రామనామానే్న నిరంతరం జపిస్తూ ఉంటాను అని అన్నాడట.
అసలు రామ శబ్దాన్ని పరికించి చూసినట్లైతే ‘ర- అ - మ’ అను మూడు వర్ణాల కలయిక ఈ పదము. ‘ర’అగ్ని బీజాక్షరము- శత్రువును అజ్ఞానమనే చీకట్లను, పాపాలను భస్మం చేసి వెలుగులనిస్తుంది. ‘అ’ అక్షరం ప్రకాశ ప్రతాపాది గుణములు గలదని ఏకాక్షర నిఘంటువులు చెబుతున్నాయ. ‘మ’ వర్ణం ఆనందానికి, లక్ష్మీ సంపదకు, అమ్మవారికి సంకేతం. శత్రు సంహారియై పాపం నాశనం చేసి, అజ్ఞానపు చీకట్లను తొలగించి వెలుతురునివ్వటం ద్వారా సుఖ సంతోషాది సంపదలివ్వగలశక్తిగలది ‘రామ’ శబ్దము. అందుకే దీనిని తారక మంత్రం అన్నారని చెప్పాడట. అంతేకాదు కాశీలో ఎవరైనా చనిపోయేటట్టు అయతే నేను వెళ్లి వారి చెవిలో రామ అనే తారకమంత్రాన్ని చెబుతాను. అపుడు వారికి ఇక జన్మంటూ ఉండదు. వారంతా విష్ణుసాయుజ్యాన్ని పొందుతారు అని పరమశివుడే స్వయంగా చెప్పాడట.
ఆ రాముని గురించి నేడు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా రామకథను పలుకని వారు, వినని వారు లేనేలేరంటే అతిశయోక్తి ఏముంది. సర్వం శ్రీరామమయం.

- చివుకుల రామమోహన్