Others

పురుషసూక్తం.. సర్వదేవతా స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సాహిత్యములలో వేదాలు అతి ప్రాచీన సాహిత్యము. వేదాలు మానవుని తొలి ఖండ కావ్యాలు. నాగరిక మానవుని మొట్టమొదటి వాక్యాలే వేదాలు. ఈ వేదాలకు పురుషసూక్తం ఆత్మవంటిది. వేదాలలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, రుద్రుడు, బృహస్పతి, గణపతి, బ్రహ్మ మొదలగు దేవతలందరి స్తుతిపరమైన మంత్రాలెన్నో ఉన్నాయి. కాని పురుష సూక్తము మాత్రము అన్ని దేవతల సమగ్ర స్వరూపముతో కూడుకొన్నది. ఇది సర్వదేవతా స్వరూపమైన విరాట్ పురుషుని మహిమను తెలియజేసే అద్భుత దివ్య మంత్రం. వేద పురుషుని గూర్చి తెలిపే దేవతలందరూ అంగముల వంటివారు. పురుషుడు సకల దేవతా స్వరూపుడు. యజ్ఞ భోక్తయై సర్వమంత్రసారమైన విరాట్ విగ్రహమే పురుష సూక్తములోని అధిష్ఠాన దేవత. పురుష సూక్తము నాలుగు వేదాలలో నిక్షిప్తమై యున్నది. పురుష సూక్తములోని దేవుడు విష్ణువు కాదు, బ్రహ్మకాదు రుద్రుడు కాదు. ఈ ముగ్గురికీ అతీతుడైన నారాయణుడు సర్వదేవతా స్వరూపుడు.
మానవ శరీరము జరుగు యజ్ఞ క్రియ విరాట్ పురుషుని లీలయనవచ్చును. మానవులందరూ విశ్వపురుషుని శరీరములోని అవయవముల వంటి వారే. మానవ శరీరములోని ప్రతి అవయవమునకు స్వేచ్ఛయున్నది. మన శరీరములోని ప్రతి అవయవము మిగతా అవయవములు కదలకుండా ఒక్కదానిని మాత్రమే కదిలించవచ్చును. అదే విధముగా సమాజములోని ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ యున్నది. కాని పరిపూర్ణ స్వాతంత్య్రము లేదు. చేతులను తలను వదలిపెట్టి కాళ్ళు తమంతట తాము ఇష్టము వచ్చినట్లు నడిచిపోవుటకు వీలు లేదు. ఒక వ్రేలితో వస్తువును ఎత్తవచ్చును. తాక వచ్చును. అదే విధంగా చేతితో తాక వచ్చును. ఎత్తవచ్చును. సమాజములోని వ్యక్తులు ఎంత శక్తి ఉన్నప్పటికిని ఇతరులపై ఆధారపడవలసి యుండును. మనిషి పూర్తి స్వతంత్రుడు కాదు. మన నిత్య జీవితావసర వస్తువులు ఆహారము, బట్టలు, ఇల్లు, ఉద్యోగము, వ్యాపారము మొదలైన పనులన్నింటిని వాటి ఉత్పత్తిదారులు ఆపివేసిన మన పనులన్నియు స్థంభించి పోవును. అసలు జీవనమే స్థంభించిపోతుంది. అనగా మానవునికి నిత్యకృత్యములను ఆచరించుటకుకావలసినంత స్వేచ్ఛయున్నప్పటికిని ఆ స్వేచ్ఛ తనచుట్టూ ఉన్న ఇతర మానవుల స్వేచ్ఛతో కట్టుబడి యున్నది. ఇతరుల స్వేచ్ఛ పెరిగిన మన స్వాతంథ్య్రము తగ్గును. మన స్వేచ్ఛ పెరిగిన ఇతరుల స్వేచ్ఛ పరిమితవౌతుంది. ఈ మహా సత్యానే్న వేదం మనకు తెలియజేస్తుంది. స్వేచ్ఛ లేనిచో మనిషి నిర్భయంగా ఊపిరి కూడా పీల్చలేడు. బ్రతుకుటకు ఊపిరి ఎట్లో ఆత్మ వికసించుటకు స్వేచ్ఛ అట్లే అవసరం. సమాజములోని వ్యక్తుల పరస్పర సంబంధం దృఢంగా ఉండాలంటే దృఢమైన సమాజ నిర్మాణం ఎంతో అవసరం. కావున వ్యక్తి,సమాజము మన శరీరములోని అవయవాల వంటివా అని గుర్తించుట ఎంతో అవశ్యము. శరీరం సమాజమైతే ప్రతి అవయవము వ్యక్తుల వంటివి. శరీరములోని కాలు, చేయి, కడుపులోని అవయవములు మరియు మెదడు, నోరు, ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక పని యున్నది. ఒక అవయవము చేసే పని ఇంకొక అవయవము చేయలేదు. కన్ను వినలేదు కాలేయము మాట్లాడలేదు. అట్లే సమాజములోని ప్రతి వ్యక్తి కూడా శరీరావయవముల వంటి వారే. శరీరములోని అవయవములవలే ఎవరి పనులు వారు విధిగా నిర్వహిస్తే సమాజమనే శరీరం ఆరోగ్యవంతవౌతుంది. ఒక అవయవము చేసే పని ఇంకొక అవయవము చేస్తే శరీరంలో విప్లవం బయలుదేరుతుంది. ఏ అవయవమైనా స్వలాభానికి కాకుండా మొత్తం శరీరం యొక్క ఆరోగ్యం గురించి శరీరం పనిచేస్తుంది.
సమాజములోని మేధావులు, విద్యావేత్తలు, శాస్తవ్రేత్తలు, శరీరంలోని మెదడు వంటివారు. వీరి పనులు ఉత్పత్తి బాహ్య ప్రపంచానికి కనబడదు. శాస్తవ్రేత్తలు యంత్రాలు కనిపెట్టనిచో మనిషి జీవితం చాలావరకు స్థంభించిపోతుంది. ఆహారం, ఔషధాలు లభించవు. సౌకర్యాలు కరువౌతాయి. కావున వారు మెదడు వంటివారు. అందువలన పురుష సూక్తములో ‘‘బ్రహ్మణోస్య ముఖ మాసీత్’’ అని చెబుతారు. ఇక్కడ బ్రహ్మ అంటే తెలివి. ముఖ+యః= ముఖ్యః అనగా శరీరములో ఏ అవయవము పనిచేయాలన్న నోటినుండి ఆహారం అందించాలి. అలాగే సమాజంలోని ఏ వర్గానికి మేలుకలగాలన్నా అది మేధావుల నిస్వార్థ చర్యే అని గ్రహించాలి. శరీరానికి బలం లాగా దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు సైన్యము, పోలీసుశాఖ ఎంతో అవసరము. శరీరక బలంతో చేసే పనిని సంస్కృతములో క్షత్రం అంటారు. క్షతి అంటే దెబ్బ లేక గాయం. క్షతి నుంచి రక్షించేది క్షత్రము. క్లుప్తంగా చెప్పాలంటే శత్రువుల నుండి కాపాడేది సైన్యం. శరీరం లాంటి సమాజాన్ని బాహువుల వంటి క్షత్రియులు రక్షిస్తారని పురుష సూక్తం వివరిస్తుంది. నడవాలంటే పాదాలే ముఖ్యం. సమాజాన్ని నడిపించేది కర్షక కార్మికులే. మేధావులు, సైనికులు, శ్రమజీవులైన జీవులు.
మనం పెద్ద వారికి మ్రొక్కేటప్పుడు నమస్కరించేది పాదాలకే కాని శిరస్సుకు కాదు. సమాజంలోని మేధావులను, సైనికులను, వ్యవసాయదారులను అందరిని కలిపేవాడు వైశ్యుడు. శరీరాన్ని, పాదాలను పటిష్టం చేసేవి తొడలు. కావున సమాజ పురుషునకు వైశ్యులు తొడల వంటివారు. పురుష సూక్తం ద్వారా తెలిసే మహా సత్యమిదే. పురష సూక్తములోని విరాట్ పురుషుడు సర్వమానవాళికి తండ్రి. ఏ దేశంలోనైనా మానవ సమాజమంటే అది సమాజమనే శరీరం వంటిదే. ఇది గ్రహిస్తే దేవం సుభిక్షవౌతుంది.

- పెండెం శ్రీధర్