Others

స్నేహసౌహార్థాలకు చిహ్నం తిరుప్పావై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ నుర్మాసం రాగానే విల్లిపుత్తూరు లోని విష్ణుచిత్తుడే మదిలో మెదలుతుంటాడు. ఆ రోజుల్లో విష్ణుచిత్తునకు దొరికిన చిన్నది గోకులంలో ఉన్నానని, తాను గోపికనని, తనతో ఉన్నవారందరూ గోపికలే నని అనుకొంటూ మనమందరం కలసి గోపాలబాలదేవుని కొలుద్దాం రండి అని తన చెలులందరినీ పిలిచేది. అట్లానే నేడు ఈ కలియుగంలోను ఆ సంఘటనను అనుసంధానించుకొంటూ ఆ గోదాదేవి వ్రాసి పాడిన తిరుప్పావై పాశురాలను స్మరిస్తూ నిత్యం గోపాల బాలదేవుని తమను కాపాడమని ఈ కలియుగంలో ఈతిబాధలను దూరం చేయమని తమను సైతం కృష్ణుని సంగడీలు భావించుకొంటూ అంగనలందరూ గుమికూడి కృష్ణుని స్తుతిస్తుంటారు. వైష్ణవాలయాలన్నీ కూడా శ్రీకృష్ణుని గోదాదేవి ని స్మరిస్తూ వేకుమఝాముననే తిరుప్పావైను అనుసంధానిస్తుంటారు.
ఆ రోజుల్లో విష్ణుచిత్తుని కుమార్తె అండాళ్ తన తండ్రితో కలసి తాము పెంచుకున్న తోటలో పూచిన పూలన్నీ ఏరి చక్కని మాలలు కట్టి రంగనాథునికి సమర్పించేది. తులసి వనం నుంచి తులసిని సేకరించి తులసీ ప్రియుడైన విష్ణుమూర్తికి అందంగా తాను ధరించి చూచుకొని తన తండ్రి చేత పంపించేది. అలా అండాల్ అమ్మ ధరించి ఇచ్చిన పూమాలలను, తులసి మాలలను విష్ణుచిత్తుడు తీసుకొని వెళ్లి రంగనాథునికి సమర్పించేవాడు. అక్కడి పూజారులు సైతం ఎంతో అభిమానంగా తెచ్చి ఇస్తున్న విష్ణుచిత్తుని మాలలన్నీ రంగనాథునికి అలంకరించి ఆ రంగనాథుని అందాన్ని చూచి అనిర్వచనీయమైన ఆనందానికి లోనయ్యేవారు. అట్లా గడుస్తున్న కాలంలో ఓ రోజున పూజారులు అలంకరించ బోయిన మాలలలోవారికి వెంట్రుక ఒకటి కనబడింది. వెంటనే అపచారం జరిగిపోయిందని దాన్ని విష్ణుచిత్తునకు ఎరిగించి తిరిగి పవిత్రత నిండిన మాలలు తెమ్మని చెప్పి పంపిరి. విష్ణుచిత్తుడు జరిగిన అపచారానికి మన్నించమని వేడుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లగా తను పెంచుకుంటున్న చిన్నారి మాలలు ధరించి పూలతోటలోని బావిలో తన అందాన్ని చూచుకొని మురిసిపోవడం చూచాడు. దానితో ఎక్కడలేని కోపానికివశుడై ఈ అపచారం ఎలా చేస్తున్నావని గదమాయించాడు. చిన్నారి అండాళ్ తల్లి చిన్నబుచ్చుకుని మాలలు తయారు చేస్తానని అంటే వద్దు వద్దు అంటూ తానే స్వయంగా మాలలు తయారు చేసి తిరిగి గుడికి వెళ్లి రంగనాథునికి అతి పవిత్రంగా తెచ్చిన పూమాలలను అలంకరించమని ఆ పూజారులను వేడుకున్నాడా విష్ణుచిత్తుడు. ఆ పూజారులు సైతం ఆ మాలలను ధరింపచేయడానికి వెళ్లగా ఆ విగ్రహమై ఉన్న రంగనాథుడు చైతన్యం పొంది వ్యక్తుడై ‘‘ ఓ మానవుల్లారా! మీరు తెచ్చిన ఈ పూమాలలకన్నా అండాళ్ తాను ధరించి ఇచ్చిన పూమాలలే మాకు ప్రియమైనవి వాటినే నేను ధరిస్తాను. వెళ్లి అవియే తెండి’’ అని పురమాయించాడా భక్తవత్సలైడైన రంగనాథుడు. విష్ణుమూర్తి వాత్సల్యానికి కరిగిపోయి కన్నీళ్లు ప్రవహిస్తుండగా పరుగు పరుగున వచ్చి ఆ ఆండాళ్ తల్లికి ఆ విషయం చెప్పి మరలా తాను ఇచ్చిన పూమాలలు పట్టుకొని పరుగెత్తగా ఆండాల్ కూడా ఏతెంచింది గుడికి. రంగనాథుడు ఆమెను చూడగానే ‘ఓ ప్రియబాంధవా నాకు నీవే పతివి, గతివి, నీవు తప్ప అన్యమెరుగని దానని అని ఆండాళ్ విన్నవించగా ఆ రంగనాథుడు విష్ణుచిత్తునితో నీ కూమార్తెతో నాకు వివాహం చేయించు నేను ఆ చిన్నదాన్ని చేతినిగ్రహిస్తాను అని చెప్పాడట. ఆ విష్ణుమూర్తి మాటలు విన్న విష్ణుచిత్తుని అంతరంగమంతా ఆనందడోలికలు ఊగగా ఆ మాటలు పదేపదే నెమరువేసుకొంటూ తాను అల్లారు ముద్దుగాపెంచుకున్న ఆండాళ్‌ను రంగనాథునికి ఇచ్చి వివాహతంతును చేసి మురిసిపోయాడు విష్ణుచిత్తుడు.
తనలోకి ఐక్యంచేసుకొన్న ఆండాళ్ తల్లిని, ఆ భక్తవత్సలుడైన రంగనాథుని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ధనుర్మాసంలో తిరుప్పావైను అనుసంధానిస్తూ ప్రతి వైష్ణవాలయమూ అంగరంగవైభోగంగా ఆండాళ్ రంగనాథుల వివాహమహోత్సవాన్ని జరిపిస్తారు. అంగనలందరూ రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుంటూ ఇంటి ముందర రంగవల్లులను తీర్చి రంగనాథుని కొలవడం ఆచారంగా అనాదిగా వస్తోంది. ఈ సంక్రాంతి ముగ్గులు సైన్సు పరంగాను క్రిమిసంహారిణులుగా పనికివస్తే రంగనాథుని కొలువు అందరిలోను ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ మనస్సుల్లోని భేదాభావాలను తుడిచివేస్తూ అంతటా సమభావాన్ని సమబుద్ధిని పెంచుతాయ.

- ఎస్.లక్ష్మి