రాష్ట్రీయం

మావోల కీలక నేత అయితా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 7: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసులు సోమవారం మావోయిస్టు కీలక నేత ఒకరిని అరెస్టు చేశారు. కరుడుగట్టిన ఈ మావోయిస్టును దర్బా ఘాట్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు బస్తర్ ఐజీ కల్లూరి వెల్లడించారు. మడకామి అయితా అనే ఈయన దండకారణ్య కిసాన్ మోర్చా అధ్యక్షుడు. కాంకేర్ ఏరియా కమిటీలో ప్రధాన నాయకుడు. ఈయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. 8 కేసులు నమోదై ఉన్నాయి. ఏడేళ్లుగా దళంలో ఉంటున్న అయితా 2009లో జూన్ 21న కొహన్‌వాడ గ్రామంలో జరిగిన 11 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల హత్య, 2013 మే 25న దేశాన్ని కుదిపేసిన జీరమ్‌ఘాట్ ఘాతుకంలో మహేంద్ర కర్మ, అప్పటి కేంద్ర మంత్రి విసి శుక్లా, చత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడు సహా 32 మందిని ఊచకోత కోసిన కేసులో ప్రధాన సూత్రధారి. ఈయన వద్ద నుంచి తుపాకీ, 8 కిలోల మందుపాతరను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ కల్లూరి వివరించారు.