గ్రహానుగ్రహం

ఆరూఢం-పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమం చతుర్థే దశమే స స్థితి స్తదపేక్షయా - శుభ పాప గ్రహాణాం చేద్బంధనం నాత్ర సంశయః - లగ్నము, ఆరూఢములకు చతుర్థ దశమముల యందు శుభ పాప గ్రహముల సామ్యము ఉన్న యెడల బంధనము కలుగును. ఇది కారాగార యోగముగాను లేదా ప్రైవేట్‌గా అనగా కిడ్నాప్ వంటివిగా కూడా చెప్పవచ్చు. అధికారులు నిర్బంధించారు, ప్రజలు నిర్బంధించారు అని చెబుతుంటారు కదా! అటువంటి ఫలితాంశాలను ఇక్కడ వర్తింపజేయవచ్చును. సామ్యము అనే పదంలో ‘సంఖ్య’ అని తీసుకోవచ్చు లేదా బలము అని కూడా తీసుకోవచ్చు. ‘తేషు చేచ్ఛ్భు సంబంధో భటై దావవరణం ప్రభోః పాపాన్వయే శృంఖలాది పీడా ప్రహరణాదికమ్’ అలా చెప్పబడిన స్థానములకు శుభ గ్రహ వీక్షణ సంబంధం కలిగిన యెడల రాజభటులచే పట్టుబడుటయు పాపగ్రహ సంబంధం కలిగిన యెడల శృంఖలాబంధనం రాజదండనం చెప్పాలి. మరి పాపగ్రహ సామ్యము శుభగ్రహ వీక్షణాది సంబంధం అయితే ఎవరైనా అధికారులు పట్టుకోవడం, వెహికల్‌కి ఫైన్ వేయడం వంటివి స్థానబలం యొక్క స్థాయినిబట్టి నిర్ధారించాలి. యోగం అవయోగం ఏదైనా స్థాయిని అనుసరించి ఫలితం చెప్పాలి. స్థానబలం ఎక్కువ అయితే ఎక్కువ యోగం లేదా శిక్ష తక్కువ అయితే తక్కువ యోగం తక్కువ శిక్ష చెప్పాలి. రాశేః కోణవర్తీ రాహుశే్చ త్సూర్య వీక్షితః నేత్రరోగీ భవేన్నూనం వోచేత్తత్ర శుభాన్వయః శుక్రుడు వున్న రాశికి కోణములలో రాహువు వుండి ఆ రాహువుకు రవి వీక్షణ వున్న యెడల శుభగ్రహ సంబంధం రాహువు లేని యెడల నేత్ర రోగి కాగలడు. మరి రవి ఎలాగ చూస్తారు అని అడగవద్దు. జైమిని పరాశరులు, కేవలం సప్తమ స్థాన దృష్టి ఒకటే కాకుండా ఇంకా ఇతర దృష్టి విషయాలు తెలియజేశారు. అందులో భాగంగా రవి శుక్రుడికి దగ్గర్లో వున్నప్పటికీ.. శుక్రుడికి కోణంలో వున్న రాహువును చూస్తారు. గతంలో మనం దృష్టి విషయాధ్యాయం ఈ అంశంలోనే చదివాము. గ్రహచార దర్పణం 1వ భాగంలో ఇంకా వివరములు ఉన్నాయి.
ఆరూఢ లగ్నే లగ్నేవా చంద్ర శుక్రాయదిస్థితౌ చతురంగ బలాదీని రాజ చిహ్నాని సంతిహి లగ్నమునందు లేదా ఆరూఢ లగ్నము నందు చంద్ర శుక్రులు వున్న ఎడల ఆ జాతకుడు చతురంగ బలము మొదలయిన రాజ చిహ్నములతో భోగ జాతకుడు కాగలడు. ‘ఉపపదము’ అని ఆరూఢ చక్రములో రాసి ఉంటుంది. ఆ ఉపపదంలో పాపి వున్న యెడల లేదా ఉపపద స్థానమునకు పాప సంబంధము కలిగిన ఎడల జాతకునకు సంన్యాసము లేదా కళత్ర వియోగం చెప్పబడినది. మరి ఉపపదంలో వున్న రవి మాత్రం పాపగ్రహ కాదుట. రవిః పాపోనోపపదే నోక్త దోష శ్శుభాన్వయే - స్యాతాం తౌచ కళత్రేశ నీచత్వాది స్వభావశః॥ ఉపపదమునకు శుభగ్రహ సంబంధము కలిగినేని వెనుక చెప్పిన సన్యాసముగానీ, కళత్ర వియోగము గానీ కలుగదు. ఒకవేళ కళత్రాధిపతికి నీచత్వాది దోషములు కలిగినప్పుడు కలుగును. ఉపపదే ద్వితీయేవా గ్రహస్స్యక్షేత్రగోయది. లగ్నాత్సప్తసు పాపస్స్యా త్స్వక్షేత్రో యది వర్తతే - ఉత్తరాయుషి నిర్దారో భవేన్నో చేచ్ఛ్భున్వయః. ఉపపదమునకు గానీ దాని ద్వితీయమునకు గానీ అందులో స్వక్షేత్ర గ్రహం వున్ననూ.. లగ్నము ఆరూఢ లగ్నము కారక లగ్నాదులకు సప్తమంలో స్వక్షేత్ర గ్రహముగా ఏదేని పాపగ్రహం వున్న యెడల ఉత్తర వయస్సులో కళత్ర విహీనం కలుగును. ఉదాహరణకు ఉపపదం మకరం అయినది. మకరంలో లేదా కుంభంలో శని వున్నారు అనుకోండి. శని స్వక్షేత్రంలో వున్నారు కావున దోషం చెప్పబడుతున్నది. ఇదే రీతిగా జన్మలగ్నానికి సప్తమంలో పాపగ్రహం వుంటే ఆ పాప గ్రహమునకు ఆ స్థానం స్వక్షేత్రం అయితే అనే అంశంలో చాలా మతాంతర పాఠాలు వున్నాయి. కళత్రాధిపతి కళత్ర స్థానంలో స్వక్షేత్రంలో వుంటే దోషం లేదు అనేవారున్నారు గానీ ఫలితాలు మాత్రం పై విషయాన్ని సూచిస్తున్నాయి.
*

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336