జాతీయ వార్తలు

అసద్ ప్రకటనను ఖండించిన జావేద్ అక్తర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మార్చ్ 15: గొంతుపై కత్తిపెట్టి డిమాండ్ చేసినా భారత్ మాతాకీ జై అని చెప్పే ప్రసక్తే లేదన్న ఎం.ఐ.ఎం లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనను ప్రముఖ సినీ రచయిత, కవి, రాజ్యసభ సభ్యుడు జావేద్ అక్తర్ ఖండించారు. జావేద్ అక్తర్ మంగళవారం రాజ్యసభలో తన వీడ్కోలు ప్రసంగం చేస్తూ తెలంగాణా రాజధాని హైదరాబాదులోని ఒక గళ్లీలో ఉండే ఒక వ్యక్తి భారత్ మాతాకీ జై అని ఎటువంటి పరిస్థితిలో చెప్పనని ప్రకటన చేశారు, ఈ ప్రకటనను నేను అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాను, భారత్ మాతాకీ జై అని చెప్పాలనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి గొంతుపై కత్తి పెట్టినా ఈ మాట చెప్పనని ఆయన ప్రకటించారు, షేర్వానీ తొడగాలని రాజ్యాంగంలో రాసి ఉన్నదా? అని జావేద్ నిలదీశారు. భారత్ మాతాకీ జై అని చెప్పవలసిన అవసరం ఉన్నదా?లేదా? అనేది ముఖ్యం కాదు, భారత్ మాతాకీ జై అనటం నా అధికారం, అందుకే భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై అని జావేద్ ఆవేశంతో నినదించారు. జావేద్ అక్తర్ ఈ మాటలంటున్నప్పుడు సభలో ఉన్న వారంతా బల్లలు చరుస్తూ ఆయనను అభినందించారు. ముస్లింలు పాకిస్తానీయలు అని నినాదాన్ని కూడా ఖండిస్తున్నానని జావేద్ చెప్పారు. దేశంలో లౌకిక వాదం ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం కొనసాగుతుంది, లౌకికవాదం దెబ్బతిన్నరోజు ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుందని ఆయన హెచ్చరించారు.