మెయన్ ఫీచర్

విపరీత ధోరణులతో అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభ్యత, నైతిక విలువలతో కూడిన నాగరిక సమాజంలో క్యాంపస్‌లు ర్యాడికలైజ్ కావడం అత్యంత ప్రమాదకరం. ప్రపంచ వ్యాప్తంగా నాగరిక విలువల మూలాలపై మత ఛాందసవాదం తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. ఇది ఎందుకు ప్రమాదకరమైనదంటే, విత్తనం మొక్కగా..ఆ తర్వాత వృక్షంగా ఎదగడానికి ముందే..అంటే బీజ దశలోనే ఈప్రమాదకరమైన పదార్ధాన్ని చొప్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఇక స్వాతంత్య్రానంతరం ప్రారంభమైన నెహ్రూ యుగం ఆయన కుమార్తె ఇందిర కాలంలో మరింత సుస్థిరమైంది. సరీగ్గా ఇదే సమయంలో వామపక్ష ఉదారవాదులు, రాడికల్ లిబరల్స్ (విరోధాభా స కదూ?), మార్క్సిస్టు చరిత్రకారులకు విద్యా సంస్థలు పెట్టని కోటలుగా మారిపోయాయి. ఈవిధంగా ర్యాడికలైజ్ అయిన క్యాంపస్‌లు క్రమంగా తమ రెక్కలను విస్తరించడం మొదలుపెట్టాయి. వేగంగా కాకపోయినా నిదానంగా ప్రజాస్వామ్య సంస్థలైన మీడియాలో అధికభాగం, న్యాయవ్యవస్థలోకి కొంత మేర విస్తరించాయి. జీవించే హక్కును కూడా ఒకసారి న్యాయవ్యవస్థ తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి గుర్తుందా? నిబద్ధతకు మారుపేరు న్యాయవ్యవస్థ మరి!
2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం ఎప్పుడైతే మితవాదుల హస్తగతమైందో, క్యాంపస్ పరిరక్షకులు (కస్టోడియన్లు), కార్యకల్లో ఒక్కసారిగా మానసిక ఆందోళన మొదలైంది. ఏవిధమైన ఇబ్బందీ లేకుండా తమ అజెండాను అమలు జరుపుతున్న వీరిలో క్రమంగా పట్టుకోల్పోక తప్పదన్న భయం ఆవహించింది. ఈ నేపథ్యంలోనే వివిధ విద్యార్థి సంఘాల్లో ఒక్కసారిగా చైతన్యం రగిలించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడికి పాల్పడేందుకు ప్రోత్సహిస్తున్నారు. భారత్‌లో రాడికల్ అభిప్రాయాలనే కొనసాగించాలని యత్నిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం ఒక్కటే. మెజారిటీ ప్రజలు పాటించే విలువలను ధ్వంసం చేయడం.
లెప్ట్ లిబరల్స్ బలంగా ఉన్న ఐఐటి మద్రాసు, అంబేద్కర్-పెరియార్ సర్కిల్ (ఎపిఎస్‌సి) క్యాంపస్‌లు మోదీ ప్రభుత్వంపై జరిపే పోరాటంలో ముందున్నాయి. అందువల్లనే మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించడానికి, ద్వేషించడానికి అన్ని రకాల రాజకీయ శక్తులు, ఎపిఎస్‌సి వేదికను బాగా ఉపయోగించుకున్నాయి. తమిళనాడులో వ్యాప్తి చెందిన నాస్తిక వాదానికి మూలం పెరియార్. ఇది హిందూ వ్యతిరేక వాదం. తమ వాదానికి విశ్వసనీయత కోసం వీరు అంబేద్కర్‌ను ముందుకు తీసుకొస్తారు. ఏడాది క్రితం క్యాంపస్‌లో వామపక్ష అనుబంధంగా పనిచేసే ఐఐటి-ఎం బ్యానర్ కింద ఉపన్యాసాలను నిర్వహించి నానా హడావిడి చేశారు. అప్పట్లో వీరు విడుదల చేసిన ఒక కరపత్రంలో ఈవిధంగా పేర్కొని ఉంది, ‘‘హిం దూత్వ అజెండాను ముందుకు తీసుకెళుతున్న మోదీ ప్రభుత్వం, బహుళజాతి సంస్థలకు భరతమాతను దోచి పెడుతోంది.’’ మరొక కరపత్రంలో ఈవిధంగా ఉంది..‘‘స్వదేశీ పేరుతో వారు (కేంద్రం) దేశాన్ని అమ్మేయడమే కాదు మతం ముసుగులో దేశమాత బిడ్డలను నిలువునా చీలుస్తున్నారు.’’ ఒక పక్కన ఇంతటి తీవ్రస్థాయి ప్రకటనలు చేస్తూ, దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదనడం ఎంత హాస్యాస్పదం! ఇది ఒక అంటువ్యాధికి మల్లే పాకిపోయి..్భరత్‌లో భద్రత లేదని అమీర్‌ఖాన్ భార్య అనేవరకు వెళ్లింది.
ఇటువంటి తుచ్ఛ ప్రేలాపనలకు,పనులకు వెనుక ఎవరున్నారనేది వివరించేందుకు రాకెట్ సైన్స్ స్థాయి పరిజ్ఞానం అవసరమా? ఇక వామపక్ష భావజాల పార్టీలన్నీ ఈ వేదికలను ఉపయోగించుకుంటూ హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ విద్యా సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ విద్యా పరమైన స్వేచ్ఛను అణచివేస్తున్నదంటూ ఒకటే గగ్గోలు. పూణె లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ)లో జరుగుతున్న నిర్వాకాన్ని మరింతగా వివరించాల్సిన అవసరం లేదు. సమ్మెలు, సత్యాగ్రహాలు, బెదిరింపులు, ఘెరావ్‌లతో 140 రోజుల పాటు విద్యార్థులు చేసిన ఆరాచకం.. సంస్థ కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఐదు నెలలుగా ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉండటానికి వీలుగా విద్యార్థులు కాని కొన్ని బయటి శక్తులు కూడా ఇందులోకి ప్రవేశించాయి. రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా విద్యా సంస్థలను కాషారుూకరించేస్తున్నారంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.
క్యాంపస్‌లు ర్యాడికలైజేషన్ కావడం జవహర్‌లాల్ యూనివర్సిటీ (జెఎన్‌యు) నుంచి ప్రారంభమైంది. అది కేవలం తీవ్ర వామపక్ష భావాలను కలిగిన వారిని ఉత్పత్తి చేసే స్థావరంగానే కాకుండా, దేశంలోని వివిధ ప్రజాస్వామ్య సంస్థల్లోకి వామపక్ష మేధావులను సరఫరా చేయడానికి.. అక్కడ వారు మమేకమయ్యేలా చేయడానికి కేంద్రస్థానంగా ఉపయోగపడింది. ఇటీవల జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మన భారతీయ సంస్కృతి, నాగరికత విలువలకు పూర్తి విరుద్ధమైన రీతిలో ఒక సంఘటన జరిగింది. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (డిఎస్‌యు), కన్‌సర్న్‌డ్ స్టూడెంట్స్ (సిఎస్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అఖిల భారత వెనుకబడిన తరగతుల విద్యార్థుల ఫోరం వంటి వామపక్ష ఉదారవాదులకు మద్దతునిచ్చే అన్ని విద్యార్థి సంఘాలవారు దుర్గాష్టమి నాడు ‘‘మహిషాసుర బలిదాన దినాన్ని’’ పాటించారు. ఈ ‘‘సెక్యులర్’’ ముఠా చెప్పేదాని ప్రకారం హిందూ పండుగలన్నీ ‘‘స్థానిక జాతులను’’ ఆర్యులు ఓడించిన సందర్భాన్ని పురస్కరించుకున్నవే!
వీరు దుర్గాష్టమిని అత్యంత గర్హనీయమైన రీతిలో వివరిస్తారు. అదెలాగంటే..మహిషాసురుడిని యుద్ధంలో ఓడించడం సాధ్యంకాకపోవడంతో ఆర్యులు దుర్గ అనే ఒక వేశ్యను ప్రయోగిస్తారు. ఆమె అతగాడిలో మరులు రేపి మోసగించి హత్య చేస్తుంది! ఈ కుట్రలో భాగంగా మహిషాసురుడితో, దుర్గ కొన్ని రోజుల పాటు ‘గడుపుతుంది’. చివరకు తొమ్మిదవ రోజున ఆమె మహిషాసురుణ్ణి మట్టుపెడుతుంది! ఆ మరునాడు అంటే పదవరోజున ఆర్యులు పెద్ద ఎత్తున హత్యాకాండకు పాల్పడతారు. ఆ రోజునే మనం ఇప్పటికీ విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఇదేదో కొందరు దారితప్పిన యువకులు చేసిన పని అని మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. ఎందుకంటే ‘మహిషాసుర బలిదాన దినాన్ని’ పాటించిన సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నిరసనలో ‘బోధనా సిబ్బంది’కూడా పాల్గొనడం ఇక్కడ గమనార్హం. వాస్తవానికి ఇది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న తతంగమే. కేవలం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రారంభం కాలేదు. కాకపోతే గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, ఈసారి ఎఐఎస్‌ఎఫ్ (సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం) కూడా ఈ రాడికల్స్‌తో చేరింది. అంతే తేడా! కానీ మన జనసాధారణ మేధావులు ఇప్పటికీ మనదేశంలో ఇంకా భావప్రకటనా స్వేచ్ఛలేదని భావిస్తుండడమే విచిత్రం!
ఇక దీపావళి పండుగ విషయానికి వద్దాం. ఈ పండుగను పురస్కరించుకొని ఉస్మానియా, హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు నరకాసుడి బొమ్మను ఏర్పాటు చేసి అతని గుణగణాలను కీర్తిస్తూ పాటలు పాడారు. వారి ప్రకారం నరకాసురుడు ద్రావిడ జాతికి చెందిన వాడు. పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి. విదేశాలనుంచి చొరబడిన ఆర్యులు అందులోని చాలా భాగాన్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ ప్రజాబాహుళ్యంలో నెలకొన్న విశ్వాసాలను, వారు అనుసరించే సంప్రదాయాలను పరిహాసం చేయడం లేదా ఖండించే చర్యలు తప్ప మరోటి కావు. భారత్‌పైకి ఆర్యులు దండయాత్రలు చేసి ఆక్రమించారన్న సిద్ధాంతం తప్పని పురావస్తు మరియు చారిత్రక ఆధారాల ద్వారా నిరూపణ అయిన సంగతి వీరికి తెలియదు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన దళిత, బహుజన, ఆదివాసి విద్యార్థి సంఘాలు నిర్వహించిన ప్రత్యామ్నాయ దీపావళి ఉత్సవాలు కేవలం హిందూ సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చడానికి తప్ప మరొకందుకు ఉద్దేశించినవి కావు.
ఇక క్యాంపస్‌లలో చోటు చేసుకుంటున్న తాజా పరిమాణం ‘పెద్దకూర పండుగలు’ (బీఫ్ ఫెస్టివల్స్). దాదాపు ప్రతి రాష్ట్రానికి చెందిన కళాశాలలు ఈ పండుగలో పాలుపంచుకుంటున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో శ్రీ కేరళ వర్మ కాలేజీ ఉంది. ఇక్కడి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు గోమాంసం, రొట్టెలను పంచారు. గోవధను నిషేధానికి నిరసనగా వారీ కార్యక్రమాన్ని చేపట్టారట. క్యాంపస్‌లో ఆవరణలో మాంసాహారానికి అనుమతి నిషిద్ధం. మరి ఈ నిబంధనను వీరు ఉల్లంఘించినట్లే కదా! దీన్ని వ్యతిరేకించిన ఒక కార్యకర్తపై జరిగిన దాడిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకామె ఫేస్‌బుక్‌లో సమర్థిస్తూ కామెంట్ చేయడం మరీ దారుణం. బహుశా దీనే్న ‘సహనానికి’ ప్రతీకగా భావించాలా? ఇక ఈ తమాషా ఇంతటితో ఆగలేదు. కేరళలోని మహారాజా కళాశాల కూడా ఇందులో చేరింది. ‘‘సమాజంలోని సాధ్యమైనంత ఎక్కువమందికి గోమాంసాన్ని అందించడమే మా లక్ష్యం’’ అంటూ ఆ కళాశాల విద్యార్థులు ప్రకటించారు. యువజన కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థ కేరళ విద్యార్థి సంఘం వారి నిర్వాకం ఇది. చెన్నై, కోల్‌కతా, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో కూడా ఇటువంటి ‘పండుగల’ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి ప్రశాంతతకు మారుపేరు. ఇది ఒకప్పటి మాట. ఇది కూడా వామపక్ష భావజాల ఉత్పత్తి కేంద్రంగా తయారైంది.
ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన తాజా సమాచారం ఏమంటే.. డిసెంబర్ 10న ప్రపంచ మానవహక్కుల దినాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ‘పెద్దకూర పండుగ’ (బీఫ్ ఫెస్టివల్)ను నిర్వహించడం ద్వారా తిండి విషయంలో హక్కులను మరింత నొక్కి చెప్పాలని నిర్వాహకుల ఉద్దేశం. ఒక వర్గానికి (వీరు వేటికి అనుబంధమో చెప్పనవసరం లేదు) చెందిన ఈ విద్యార్థులకు ఇతర యూనివర్సిటీలకు చెందిన బోధనా సిబ్బంది, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ముఠాలు మద్దతు పలుకుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానితులెరో చూ ద్దాం : అరుంధతీ రాయ్, కర్ణాటక ముఖ్యమం త్రి సిద్దరామయ్య, తమిళనాడులోని విసికెకు చెందిన థోల్‌థిరుమవలవన్‌లు. మరి ఇటువంటి ఉత్సవాల వాణి, భావం ఏమిటో గమనించారా? వీటి లక్ష్యం ఒక్కటే.. మెజారిటీ మతానికి చెందిన ‘‘తిరోగామి’’ వర్గమైన మోదీ మరియు ఆయన పార్టీని దెబ్బతీయడం!