రాష్ట్రీయం

ఆస్కి కోర్టు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా పద్మనాభయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శిక్షణ, పరిశోధనా సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) కోర్టు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య నియమితులయ్యారు. 1961 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి పద్మనాభయ్య పద్మభూషణ్ గ్రహీత కూడా. మంగళవారం నాడు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు. గతంలో ఆస్కికి ఉన్న గౌరవప్రతిష్టలను ఇనుమడింపచేస్తానని ఈ సందర్భంగా పద్మనాభయ్య వ్యాఖ్యానించారు. అన్ని రకాలుగా సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు తమ సహకారం ఉంటుందని సిబ్బంది ప్రమాణం చేశారు.