సబ్ ఫీచర్

ఆశ కార్యకర్తల వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అక్షరాల అమలుచేయాల్సి ఉండగా పాలకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఆశ కార్యకర్తలను వెట్టిచాకిరికి గురిచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవలు అమలుకావాలంటే క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం. ఆశా కార్యకర్తలకు అధికారులు అందించే వేతనం దినసరి కూలీ కంటే అధ్వాన్నంగా ఉంది. వెట్టిచాకిరి చేయించుకుని అరకొర పారితోషికం ఇస్తున్నారు. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో ఆశావర్కర్ల కుటుంబాలు పూట గడవని స్థితిలో ఉన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే అధికారులు, ఆశా కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నది. ఏళ్ళ తరబడి వెట్టిచాకిరి చేస్తున్న అధికారులు వారిపై కనికరం చూపడం లేదు. గ్రామాల్లో వైద్య సిబ్బంది వచ్చినా రాకపోయినా తమ విధులను రోజంతా అంకిత భావంతో చేస్తున్నారు. ఆరోగ్య విషయంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిని మాత్రం అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. భారమైన విధులతో దుర్భర జీవితాన్ని నెట్టుకు వస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు, దీక్షలు చేసినా ఎవరూ స్పందించక పోవడంతో ఆశా కార్యకర్తలు నిరాశలతో విధులు నిర్వహిస్తున్నారు. శ్రమకు తగిన ఫలితంకోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా గుర్తుకువచ్చేది ఆశా కార్యకర్తలే. ఆశా కార్యకర్తలకు తగిన వేతనాలు ఇవ్వకపోగా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. ఉపాధి పనులకు వెళ్ళే కూలీలకు సైతం రోజుకు రూ.100 నుండి రూ.150 సంపాదిస్తారు. అంతకంటే అధ్వాన్నంగా వీరి వేతనాలు ఉన్నాయి.
రోజంతా రెగ్యులర్ ఉద్యోగులతో పనిచేస్తే వీరికి నెలకు రూ.5వేలు సైతం రావడం లేదు. ప్రతినెలా వీరు పొందే వేతనం రూ.1000 నుండి రూ.1500 మించడం లేదు. దీంతో వేరే ఉద్యోగం చేయలేక ఉన్న ఉద్యోగం వదులుకోలేక సతమతం అవుతున్నారు. వచ్చే అరకొర వేతనం కూడా సకాలంలో రాక ఇబ్బంది పడుతున్నారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో వైద్య సిబ్బందితో సమానంగా సేవలందించడంలో వీరి పాత్ర కీలకం. గర్భిణిలు, బాలింతలు, హెచ్.ఐ.వి. శుభ్రత, పల్స్‌పోలియో, డి.ఇ.సి. మాత్రల పంపిణీ, ఎనామిక్ సమయంలో 108 వచ్చిన సమయంలో వ్యాధి నిరోధక కార్యక్రమం కుటుంబ నియంత్రణ ప్రోత్సహించడం, క్షయ కుష్టు రోగులను గుర్తించడం, బరువుతక్కువ ఉన్న పిల్లల వివరాలను పిహెచ్‌కు తెలియజేయడం, విధులను అన్నీ తామై విధులు నిర్వహిస్తున్నారు. ఇలా నిరంతరం సేవలందిస్తున్నవారికి కనీస వేతనం అందడం లేదు. ప్రసూతి కేసుకు రూ.300 పిల్లలకు ఇచ్చే టీకాలకు ఒక్క కేసుకు రూ.180 గర్భిణీ పేరు నమోదుచేస్తే రూ.30 చెల్లిస్తారు. ఇక పల్స్‌పోలియోలో పాల్గొంటే రోజుకు రూ.75, సర్వేలు ఇతర సేవలకు రూ.350 వరకు చెల్లిస్తారు. ఇవికూడా చేతికి అందేవరకు నమ్మకం లేదు.
తక్కువ వేతనం చెల్లింపులోనూ ఆలస్యంతో కుటుంబాలను పోషించుకోలేక పోతున్నామని ఆశావర్కర్లు వాపోతున్నారు. తద్వారా ఆశా కార్యకర్తలుగా పనిచేసే బదులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తే నెలకు రూ.5వేలు సంపాదించుకోవచ్చని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 రోజులుగా తమను రెగ్యులర్ చేయాలంటూ ఆశ కార్యకర్తలు మం త్రుల కాన్వాయిలను ముట్టడిస్తూ, రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరాపార్కుతో సహా ఎవరుకూడా ధర్నాలు, నిరాహారదీక్షలు చేయకుండా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి హామీఇచ్చి, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా హామీలను విస్మరించారని పలువురు ఆరోపిస్తున్నారు.

- ఆర్. రాజేశం