జాతీయ వార్తలు

ముడుపులపై సోనియా నోరు విప్పాలి: అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరెవరికి ముడుపులు అందాయన్న విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇకనైనా నోరు విప్పాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కుంభకోణానికి సంబంధించి ఇటలీ జైలులో ఎవరెవరున్నారు? ఎంత మేరకు అవినీతి జరిగింది? ఎవరెవరికి ఎంతెంత ముడుపులు అందాయో సోనియా చెప్పాలన్నారు. ఈ వాస్తవాలను తెలుసుకునే హక్కు భారత ప్రజలకు ఉందన్నారు.