ఆటాపోటీ

అశ్విన్ అదరహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సఫారీలకు చుక్కలు చూపిస్తున్న స్పిన్నర్

ప్రపంచ క్రికెట్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉభ్న జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. పైగా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను ప్రదర్శిస్తున్న అతను నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక, సఫారీలపై భారత్‌కు 11 సంవత్సరాల తర్వాత తొలి సిరీస్ విజయాన్ని అందించాడు. తొమ్మిదేళ్లుగా విదేశాల్లో అజేయ జట్టుగా వెలుగుతున్న దక్షిణాఫ్రికాను ఒక్కసారిగా నేలకుదించాడు. మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 98 పరుగులకు 12 వికెట్లు పడగొట్టడం భారత్‌కు కలిసొచ్చింది. సిరీస్‌ను భారత్ ఖాతాలో వేసింది. ఇప్పుడు జరుగుతున్న చివరి టెస్టులో దక్షిణాఫ్రికా గెలిచినా, టీమిండియాకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. భారత్‌ను విజయపథంలో నడిపే క్రమంలో అశ్విన్ పలు వ్యక్తిగత రికార్డులను అందుకున్నాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు కూల్చిన ఏడో భారత బౌలర్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే చెరి మూడు పర్యాయాలు ఈ ఫీట్‌ను సాధించారు. కాగా, టెస్టుల్లో ఒక భారత స్పిన్నర్ అత్యంత వేగంగా 50 టెస్టు వికెట్లను పడగొట్టడం ఇదే మొదటిసారి. 1962లో వినూ మన్కడ్ తొమ్మిది టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరితే, అశ్విన్ తన ఎనిమిదో టెస్టులోనే యాభై వికెట్లను పూర్తి చేయగలిగాడు.
ఒక భారత బౌలర్ ఏడాదిలో 50 వికెట్లను తీయడం ఏడు సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. 2008లో హర్భజన్ సింగ్ ఒక క్యాలండర్ ఇయర్‌లో యాభై వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఆతర్వాత అశ్విన్ ఆ ఫీట్‌ను పునరావృతం చేశాడు. కాగా, ఒక క్యాలండర్ ఇయర్‌లో ఆరుసార్లు ఒక్కో ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా అశ్విర్ రికార్డు నెలకొల్పాడు. 1955లో సుభాష్ గుప్తే, 2001లో హర్భజన్ సింగ్, 2004లో అనీల్ కుంబ్లే ఈ ఘనతను సాధించారు. కాగా, ఒక క్యాలండర్ ఇయర్‌లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌కు 22వ స్థానం లభిస్తుంది. మాల్కం మార్షల్, ముత్తయ్య మురళీధరన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో చెరి తొమ్మిది పర్యాయాలు ఐదుకు మించి వికెట్లు కూల్చారు. క్రికెట్‌లో సహజంగా కొత్త బంతితో పేసర్లు బౌల్ చేస్తే, బంతి పాతపడిన తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగుతారు. అయితే, టెస్టు చరిత్రలోనే కొత్త బంతితో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను వేసి, ఎనిమిది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అశ్విన్ పేరు చరిత్ర పుస్తకాల్లో ఉంది. కొలిన్ బ్లైత్ (ఇంగ్లాండ్), హ్యూస్ ట్రంబుల్ (ఆస్ట్రేలియా) సరసన అతనికి స్థానం దక్కింది.