బిజినెస్

అస్సాం హాస్పిటల్స్ వాటా కొనుగోలు పూర్తి: అపోలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: అస్సాం హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలును అపోలో హాస్పిటల్స్ పూర్తిచేసింది. గౌహతీకి చెందిన అస్సాం హాస్పిటల్స్‌లో అపోలో హాస్పిటల్స్ 51 శాతం వాటాను దక్కించుకుంది. ఈ మేరకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ శనివారం తెలిపింది.
57.25 కోట్ల రూపాయలకు అస్సాం హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు గత ఏడాది అపోలో హాస్పిటల్స్ ప్రకటించినది తెలిసిందే. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో అపోలో హాస్పిటల్స్‌ను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ కొనుగోలు అని అపోలో తెలిపింది.
- ఐడిబిఐ రుణాల ఎగవేత కేసు -
రెండోరోజూ
కొనసాగిన ఇడి విచారణ
హాజరైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సిఎఫ్‌ఒ
ముంబయి, మార్చి 12: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సిఎఫ్‌ఒ ఎ రఘునాథన్.. శనివారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరయ్యారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ నుంచి తీసుకున్న 900 కోట్ల రూపాయలకుపైగా రుణాల ఎగవేత కేసులో ఇడి ముందుకు వచ్చారు. శుక్రవారం కూడా రఘునాథన్‌ను ఇడి దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించింది. విజ య్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 17 ప్రభుత్వరంగ బ్యాం కుల నుంచి సుమారు రూ. 7 వేల కోట్ల రుణాన్ని పొందినది తెలిసిందే.
మధ్యంతర డివిడెండ్‌ను
ప్రకటించిన ఐషర్ మోటార్స్
న్యూఢిల్లీ, మార్చి 12: ఐషర్ మోటార్స్ శనివారం ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 10 రూపాయల ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌కు 100 రూపాయలను మధ్యంతర డివిడెండ్‌గా ప్రకటించింది. దీనికి సంస్థ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓ ప్రకటనలో ఐషర్ మోటార్స్ పేర్కొంది.