ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంనాడు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న మార్షల్స్‌పై చేసిన వ్యాఖ్యలపై వాదోపవాదాలు జరిగాయి. మార్షల్స్‌పై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. క్షమాపణలు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. మార్షల్స్‌ను బాస్టర్డ్‌ అని దూషించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చర్య తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తనకు కేటాయించిన గేటులో నుండి కాకుండా వేరే గేటులో నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ భాధతో ‘వాట్ నాన్సన్స్’ అని అన్నాను తెలిపారు. ఆందోళనలో పాల్గొని అసెంబ్లీలోకి రానివ్వటం లేదనే బాధతో అలా అన్నానని చెప్పారు. కాగా దీనిపై స్పీకర్ స్పందిస్తూ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, విచారం వ్యక్తం చేయాలని సూచించారు. తనకు జరిగిన అవమానానికి విచారం వ్యక్తంచేస్తే తాను విచారం వ్యక్తంచేస్తానని చెప్పారు.