ఆంధ్రప్రదేశ్‌

మార్షల్స్‌కు, వైకాపా ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు శుక్రవారం వైకాపా సభ్యుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్పీకర్ పోడియం వద్ద మార్షల్స్‌కు, వైకాపా సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైకాపా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్‌పైన, స్పీకర్ స్థానంపైన ఇలా దాడి చేయడం సభా సాంప్రదాయం కాదన్నారు. సభ ప్రారంభమైన వెంటనే వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేశాక చర్చ జరుగుతుందని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పినా విపక్ష ఎమ్మెల్యేలు వినిపించుకోలేదు. చర్చ తర్వాతే సిఎం ప్రకటన చేయాలంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మార్షల్స్‌కు, వైకాపా సభ్యులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎంతచెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోనందున సభను పదినిమిషాల సేపు స్పీకర్ వాయిదా వేశారు. స్పీకర్ స్థానం వద్ద వైకాపా ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగడం అప్రజాస్వామికమని అధికార టిడిపి ఎమ్మెల్యేలు విమర్శించారు. అధ్యక్ష స్థానాన్ని గౌరవించి, సభా మర్యాదలను పాటించాలని స్పీకర్ కోడెల వైకాపా సభ్యులకు పదే పదే సూచించారు.