అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావ తరంగాలు
(కవితా సంపుటి)
-గంప ఉమాపతి
వెల: రూ.60/-
ప్రతులకు: రచయిత
ఇం.నెం.10-5-528/1/1
గాంధీరోడ్, కిసాన్ నగర్
కరీంనగర్- 505 001

అనుభవైక నైవేద్యంలా కవి యొక్క ఆలోచనా స్రవంతి నుండి పురుడు పోసుకున్న తరంగాలు జీవన సత్యాలను విడమరిచి చెబుతాయి. కవి తమ అనుభవాన్ని రంగరించి రాసిన ఈ భావతరంగాలు -జీవన విధానాన్ని దర్పణంలో చూపిస్తాయి. గతుకుల బతుకులు అతుక్కునే విధంగా దిశా నిర్దేశం చేస్తాయి. ఊగే అలల ఊసులను ఊయలలూగిస్తాయి. ఒక సూర్యోదయం.. ఓ కొత్త రోజుకు ఆహ్వానం పలికినట్లు.. ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టేలా ఇందలి కవిత్వం ఉంది. స్వప్న జగత్తును విడిచి వాస్తవ ప్రపంచం వైపు మనల్ని అడుగులు వేయిస్తాయి. ప్రకృతి పారవశయంతో ప్రియుడు ప్రియురాలితో ఏకం కావడానికి ఉసిగొలుపుతాయి. జీవితం ఓ పుస్తకమనీ, అందులోని పేజీలు తెల్లకాగితాలే అయినా.. మనం జ్ఞాన నేత్రంతోనే వాటిపై కొలువుతీరిన భావాలను గ్రహిస్తామని తెలుపుతాయి. ఇలా కవి ఉమాపతి తన అంతరంగంలోని తరంగాలను వివిధ కోణాల్లో తాత్త్వికంగా ఆవిష్కరించారు. ఇవి హృదయ సముద్రపు లోలోతులకు చొచ్చుకుని పోతూ అమృత కలశాలై అమరప్రేమను ఆవిష్కరిస్తాయి. *

.............................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.