బిజినెస్

భారత్‌లో వౌలికాభివృద్ధికి రూ. 31 లక్షల కోట్లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే ఐదేళ్లపై క్రిసిల్, అసోచామ్ అంచనా
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రాబోయే ఐదేళ్లలో వౌలిక రంగాభివృద్ధి కోసం భారత్‌కు 31 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్, పారిశ్రామిక సంఘం అసోచామ్ తెలిపింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌పై విడుదల చేసిన శే్వత పత్రంలో ఈ మేరకు క్రిసిల్, అసోచామ్ పేర్కొన్నాయి. రహదారుల నిర్మాణం, పరిశ్రమలు, గృహవసరాలకు నిరంతర విద్యుత్ సదుపాయం, టెలికాం సేవల పురోగతి, మెరుగైన రవాణా సౌకర్యం, పట్టణీకరణకు భారీ స్థాయిలో నిధులు అవసరమని తెలిపాయి.

బోయింగ్ హెలికాప్టర్‌కు
ఫోకర్, ఆక్వెస్ విడి భాగాలు
హైదరాబాద్, డిసెంబర్ 17: బోయింగ్ సంస్థ రూపొందిస్తున్న చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ కోసం యంత్ర భాగాలను సరఫరా చేయడానికి జికెఎన్ ఏరోస్పేస్ విభాగం, డచ్ దేశానికి చెందిన ఫోకర్ టెక్నాలజీస్, ఏరోస్పేస్ తయారీదారు ఆక్వెస్ గురువారం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ దీర్ఘకాల ఒప్పందం ప్రకారం యంత్ర విడి భాగాలను ఆక్వెస్ సరఫరా చేస్తుంది. వీటిని భారత్‌లోనే తయారు చేస్తుంది. ఫోకర్ టెక్నాలజీస్ ఈ విడి భాగాలను అమర్చనుంది. ఈ మేరకు బోయింగ్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

హెచ్‌డిఎఫ్‌సి ఈర్గోలో
వాటాను పెంచుకున్న ఈర్గో
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జర్మనీకి చెందిన ఈర్గో ఇంటర్నేషనల్.. హెచ్‌డిఎఫ్‌సి ఈర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో అదనంగా 22.9 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. 1,122 కోట్ల రూపాయలతో ఈ వాటాను సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి ఈర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో 25.84 శాతం వాటా ఈర్గో ఇంటర్నేషనల్‌కు ఉంది. దీంతో తాజా వాటా కొనుగోలుతో ఈర్గో ఇంటర్నేషనల్ వాటా 48.74 శాతానికి చేరనుంది.