క్రీడాభూమి

మరో రికార్డుపై స్పిన్నర్ అశ్విన్ గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పడు మరో రికార్డుపై గురి పెట్టాడు. విండీస్తో సిరీస్లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో మెరిసిన అశ్విన్ న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్టులో బంతితో రాణిస్తే మరో అరుదైన ఘనత అతని ఖాతాలో చేరుతుంది. శనివారం బర్త్ డే జరుపుకుంటున్న అశ్విన్. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్ల్లో193 వికెట్లు సాధించాడు. అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ రికార్డు సాధించాలంటే అశ్విన్ కు ఇంకా ఏడు వికెట్లు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డెన్నీస్ లిల్లీ, పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనస్ల పేరిట ఉంది. వీరిద్దరూ 38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గురువారం న్యూజిలాండ్తో జరిగే టెస్టు మ్యాచ్ అశ్విన్కు 37వది కావడంతో వకార్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.ఒక సిరీస్లో రెండు సార్లు ఐదు వికెట్లకు పైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా అశ్విన్ గుర్తింపు సాధించాడు.