ఆటాపోటీ

సంప్రదాయాలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తం మీద క్రికెట్ స్వరూపమే మారిపోయింది. కానీ, కౌంటీ క్రికెట్ ఇప్పటికీ ఒక అద్భుత దృశ్యకావ్యంగానే మన కళ్ల ముందు కదలాడుతున్నది. మైదానంలో దిగే ఇరు జట్ల ఆటగాళ్లు తెల్ల దుస్తులే వేసుకుంటారు. సంప్రదాయ సిద్ధంగా ఎర్ర బంతులతోనే మ్యాచ్ ఆడతారు. ఒకప్పుడు కౌంటీ మ్యాచ్‌లను శని, ఆదివారాల్లో కాకుండా వర్కింగ్ డేస్‌లోనే నిర్వహించేవారు. ఆ మ్యాచ్‌లకు అభిమానులు భారీ సంఖ్య లో తరలివచ్చేవాళ్లు. క్రమంగా ప్రజల జీవనశైలి మారిపోయింది. ఉరుకులుపరుగుల యాంత్రిక జీవనం మొదలైంది. ఎంతో ఆసక్తి, అభిమానం ఉన్నా మ్యాచ్‌లను తిలకించేందుకు పరుగులుతీసే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఆధ్యమైనంత వరకూ మ్యాచ్‌లు వీకేండ్స్‌లో వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంతో, ఎప్పటి మాదిరిగానే కౌంటీ మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తునే ఉన్నాయి. ఈటోర్నీలకు చీఫ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ‘స్పెస్కావెర్స్’ సంస్థ కూడా కౌంటీ మ్యాచ్‌లను మరింత ఆకర్షణీయం తీర్చిదిద్దుతున్నది. అయితే, ఈ క్రమంలో మూల సిద్ధాంతాలకుగానీ, క్రికెట్ వౌలిక విలువలకుగానీ గండికొట్టే ప్రయత్నం చేయడం లేదు. అందు కే నిత్యనూతనంగా వర్ధిల్లుతోంది.