ఆటాపోటీ

మరలిరాని లోకాలకు ‘ది గ్రేటెస్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను తాను ‘ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్న ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ మృతితో క్రీడా ప్రపంచం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. టీనేజ్‌లోనే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించి, నల్ల జాతీయుల ఆశాకిరణంగా మారిన అలీ తన జీవిత కాలంలో ఎన్నడూ అమెరికా జాత్యాహంకారం ముందు తలవంచలేదు. యుద్ధ పిపాసను సమర్థించలేదు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకించి, నిషేధానికి గురైనా తన పట్టు వీడలేదు. అంతులేని ఆత్మవిశ్వాసానికి మరోపేరైన మహమ్మద్ అలీ మృతి పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ ఏడాది మృతి చెందిన క్రీడా ప్రముఖుల్లో ‘గోల్ఫ్ కింగ్’ ఆర్నాల్డ్ పామెర్ (పెన్సల్వేనియా), 1970లో ఫిఫా ప్రపంచ కప్‌ను సాధించిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు కార్లొస్ అల్బెర్టో, నెదర్లాండ్స్‌లో సాకర్ జెయింట్‌గా పేరు తెచ్చుకున్న జొహాన్ క్రఫ్, ఫిఫాకు సుమారు మూడు దశాబ్దాలు సేవలు అందించినప్పటికీ, అవినీతి కుంభకోణంలో చిక్కుకొని పరువుపోగొట్టుకున్న మాజీ అధ్యక్షుడు జవో హవెలాంజ్, 1984 వింటర్ ఒలింపిక్స్ డౌన్ హిల్ చాంపియన్ బిల్ జాన్సన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లిండ్సే టకెట్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో, ఇంగ్లాండ్ తరఫున మహిళల ఫుట్‌బాల్‌లో తొలి ఇంటర్నేషనల్ గోల్ సాధించిన సిల్వియా గోరే, ఫార్ములా వన్‌లో పోటీపడిన తొలి మహిళ మరియా టెరెసా డి ఫిలిపిస్ తదితరులు ఉన్నారు.
కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో బ్రెజిల్ క్లబ్‌కు చెందిన 50 మంది ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 71 మంది మరణించగా, వారిలో యాభై మంది బ్రెజిల్ సాకర్ క్లబ్ చపెకొయన్స్‌కు చెందిన వారే. కోపా సుడామెరికానా ఫైనల్‌లో అట్లెటికో నసియోనల్‌ను ఢీకొనేందుకు వెళుతుండగా చోటు చేసుకున్న సంఘటనలో చపెకొయన్స్ జట్టులోని నలుగురు మినహా మిగతా ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మృతి చెందారు.