ఆటాపోటీ

‘హోం’లో టీమిండియా హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోం సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు జోరు కొనసాగింది. ఈ సీజన్‌లో టీమిండియా స్వదేశంలో మొత్తం 13 టెస్టులు ఆడింది. పది విజయాలు సాధించింది. నాలుగు ట్రోఫీలను కైవసం చేసుకుంది. తొలుత న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఆ సిరీస్‌లో తమ ఆధిపత్యాన్ని కనబరిచారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌కు వైట్‌వాష్ వేసింది. అంతకు ముందు చేజార్చుకున్న టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని మళ్లీ సొంతం చేసుకుంది. ఇదే సిరీస్‌లో భారత కెప్టెన్ కోహ్లీ రెండో డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కివీస్‌తో నువ్వా-నేనా అన్న చందంగా మారిన వనే్డ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలిచిన భారత్ రెండో మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో సమవుజ్జీలుగా నిలిచిన భారత్, న్యూజిలాండ్ జట్లకు చివరిదైన ఐదో వనే్డ అత్యంతకీలకంగా మారింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో విజయం సులభమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 269 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ 79 పరుగులకే ఆలౌటైంది. అమిత్ మిశ్రా కేవలం 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. టెస్డు, వనే్డ సిరీస్‌లను సాధించింది.
ఇంగ్లాండ్‌పైనా అదే దూకుడు
న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా అదే దూడుకును కొనసాగింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మూడోసారి డబుల్ సెంచరీ చేయడం విశేషం. యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన తర్వాత ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. మొత్తం మీద టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో గెల్చుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్స్‌డే కారణంగా రెండు విడతలుగా భారత్‌కు వచ్చిన ఇంగ్లాండ్ మొదటి టెస్టును డ్రా చేసుకోగలిగింది. అయితే, రెండో టెస్టును 246 పరుగులు, మూడో టెస్టును 8 వికెట్లు, నాలుగో టెస్టును 36 పరుగులు, చివరిదైన ఐదో టెస్టును 75 పరుగుల తేడాతో గెల్చుకున్న టీమిండియా స్వదేశంలో తన సత్తా ఏమిటో నిరూపించింది. ఆతర్వాత జరిగిన వనే్డ సిరీస్‌ను 2-0 తేడాతో నెగ్గింది. మొదటి వనే్డను మూడు వికెట్లు, రెండో వనే్డను 15 పరుగుల తేడాతో భారత్ గెల్చుకోగా, ఎలాంటి ప్రాధాన్యత లేని చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరగా జరిగిన టి-20 సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయి అయింది. మొదటి మ్యాచ్‌ని ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో గెల్చుకున్నప్పటికీ, ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 5, 75 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయింది.
ఆసీస్ గట్టిపోటీ
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో సిరీస్‌లు ముగిసిన తర్వాత, ‘పసికూన’ బంగ్లాదేశ్‌తో టీమిండియా స్వదేశంలో ఒక మ్యాచ్ ఆడింది. దానిని 208 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మొత్తానికి మూడు జట్లపై టెస్టు సిరీస్‌ల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు ఆస్ట్రేలియాపై విజయం అనుకున్నంత సులభంగా దక్కలేదు. స్టీవెన్ స్మిత్ నేతృత్వంలో వచ్చిన ఆస్ట్రేలియా మొదటి టెస్టును 333 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని సంచలనం సృష్టించింది. స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదన్నది వాస్తవం కాదని, ఎదురుదాడికి దిగితే విజయాలు సాధ్యమేనని నిరూపించింది. కాగా, మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయంతో పాఠాలు నేర్చుకున్న భారత్ రెండో టెస్టులో ఆచితూచి ఆడింది. పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ, ఆ మ్యాచ్‌ని 75 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఇరు జట్లు చెరొక విజయాన్ని సాధించగా, మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీనితో ధర్మశాలలో జరిగిన చివరి, నాలుగో టెస్టుకు ప్రాధాన్యం పెరిగింది. హోరాహోరీ పోరు కొనసాగుతుందని అంతా ఊహించారు. అనుకున్న విధంగానే దాదాపు మొదటి రెండు ఇన్నింగ్స్ పోటాపోటీగానే కొనసాగాయి. కానీ, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసి, 137 పరుగులకు కుప్పకూలింది. ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది, సిరీస్‌ను 2-1 తేడాతో సాధించింది. స్వదేశంలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. - మురుకుట్ల సాయ