ఆటాపోటీ

గోల్ఫ్ కోర్స్‌లో ఫెల్ప్స్ సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్స్ప్ గోల్ఫ్ కోర్స్‌లో సందడి చేశాడు. రైడర్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొనే అమెరికా జట్టుకు మద్దతునివ్వడానికి వచ్చిన అతను ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఇర్లాండ్‌తో జరిగే పోటీలకు అన్ని విధాలా సన్నద్ధం కావాలని ఒలింపిక్స్‌లో 23 స్వర్ణాలుసహా మొత్తం 28 పతకాలను కైవసం చేసుకున్న ఫెల్ప్స్ పిలుపునిచ్చాడు. కాగా, ఐర్లాండ్ జట్టుకు మద్దతుగా టెన్నిస్ మాజీ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా, లెజెండరీ రగ్బీ ఆటగాడు పాల్ ఒకానెల్ తదితరులు రంగంలోకి దిగారు. రైడర్స్ కప్ పోటీల్లో ఇరత క్రీడలతోపాటు వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన ప్రముఖులను ఆహ్వానించడం, వారితో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇప్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి తరఫున మైఖేల్ ఫెల్ప్స్‌తోపాటు కెల్లీ స్టాటర్ (సర్ఫర్), బిల్ ముర్రే (నటుడు), టాడ్ ఇంగ్లిష్ (చెఫ్), రాబ్ రిగిల్ (నటుడు), కర్ట్ రసెల్ (నటుడు), జెరెమీ రోనిక్ (ఐస్ హాకీ), హే లూయిస్ (గాయకుడు) తదితరులు అమెరికాకు మద్దతుగా వచ్చారు. అదే విధంగా యూరోప్ జట్టుకు నవ్రతిలోవా, ఒకానెల్‌తోపాటు జోస్ ఆండ్రెస్ (చెఫ్), జాన్ రెగిస్ (అథ్లెట్), అలెస్సాండ్రో డెల్ పియారో (్ఫట్‌బాల్), ఆండ్రీ షెచెన్కొ (్ఫట్‌బాల్), నీల్ లీగో (టీవీ నిర్మాత), నియాలల్ హొరాన్ (గాయకుడు) ఉన్నారు.