ఆటాపోటీ

సచిన్‌కు పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న భారత మాజీ స్టార్ సచిన్ తెండూల్కర్‌ను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడిగా ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలిస్టార్ కుక్ తెరపైకి వస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగున్న మొదటి టెస్టు అతనికి కెరీర్‌లో 134వ మ్యాచ్. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. 200 మ్యాచ్‌లతో సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్టుల ప్రపంచ రికార్డును బద్దలు చేసే అవకాశం 31 ఏళ్ల కుక్‌కు ఉందని పరిశీలకులు అంటున్నారు. అంతేగాక, ఆ టెస్టు మొదలయ్యే సమయానికి అతని ఖాతాలో 10,599 పరుగులు ఉన్నాయి. సచిన్ 15,921 పరుగుల రికార్డుకు కూడా కుక్ నుంచి ప్రమాదం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.