ఆటాపోటీ

వండర్ కిడ్ నేగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత చెస్‌లో తొలి గ్రాండ్ మాస్టర్‌గా విశ్వనాథన్ ఆనంద్ అవతరిస్తే, అత్యంత చిన్న వయసులోనే ఈ హోదాను సంపాదించిన ఆటగాడిగా పరిమర్జాన్ నేగీ రికార్డు సృష్టించాడు. 2006 జూలై ఒకటో తేదీన నేగీ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు సంపాదించే సమయానికి అతని వయసు 13 సంవత్సరాల 142 రోజులు. తొలి గ్రాండ్ మాస్టర్ నార్మ్ సంపాదించిన వారిలో అతనే చిన్నవాడు. 2006లో తన 12వ ఏట అతను మొదటి జిఎం నార్మ్‌ను సాధించాడు. అంతేగాక, ఒక గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన భారతీయుల్లో చిన్నవాడు కూడా అతనే. 2004లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఇవాన్ నెమెట్‌ను బియెల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో ఓడించే సమయానికి నేగీ వయసు 11 సంవత్సరాల ఐదు నెలలు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు?
న్యూయార్క్ యాంకీ స్టేడియంలో సుమారు 34 సంవత్సరాల క్రితం జరిగిన బాక్సింగ్ ఫైట్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 1976 సెప్టెంబర్ 28వ తేదీన జరిగిన ఆ పోరులో మహమ్మద్ అలీ బలమైన పంచ్‌లు, తిరుగులేని హుక్‌లతో కెన్ నార్టన్‌ను చిత్తుచేశాడు. యాంకీ స్టేడియంలో అదే చివరి బాక్సింగ్ ఫైట్. ఆతర్వాత బేస్‌బాల్‌కు ఈ స్టేడియం కేంద్రమైంది. బాక్సింగ్ అభిమానులు ఇక్కడ ఓ బాక్సింగ్ ఫైట్ కోసం మూడు దశాబ్దాలకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. వారు సుదీర్ఘ నిరీక్షణకు ఈనెల 5న తెరపడింది. జూనియర్ మిడిల్‌వెయిట్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ యూరీ ఫోర్మన్, మాజీ చాంపియన్ మిగుల్ కొటో ఢీకొన్నప్పుడు, వారి ఫైట్ కంటే, యాంకీ స్టేడియంలో బాక్సింగ్ తిరిగి దర్శనమివ్వడం అభిమానులను అలరించింది. ఈ ఫైట్‌కు హాజరలైన సుమారు 30 వేల మంది ప్రేక్షకులు కేరింతలు కొడుతూ యాంకీ స్టేడియం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అలీ, నార్టన్ ఫైట్‌ను గుర్తు చేసుకున్నారు. యాంకీ స్టేడియం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. బాక్సింగ్‌కు కేంద్రంగా మారింది.

అసలైన ‘ఆల్‌రౌండర్’

కెట్ పరిభాషలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమ ప్రతిభ కనబరిచేవారిని ఆల్‌రౌండర్లుగా పేర్కొంటారు. అయతే, ఇంగ్లాండ్ క్రికెటర్ సిబి ఫ్రే వివిధ రంగాల్లో రాణించి అసలు సిసలైన ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను జాతీయ ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడు. అథ్లెటిక్స్ లోనూ తనకు తిరుగులేదని నిరూపించి, లాంగ్ జంప్ ఈవెంట్‌లో అప్పట్లో ప్రపంచ రికార్డును సమం చేశాడు. అల్బేనియా దేశానికి రాజుగా కొంతకాలం నియమితుడయ్యాడు. నానాజాతి సమితిలో భారత్ ప్రతినిధిగా వ్యవహరించాడు. తన అపూర్వ మేథా శక్తితో ప్రపంచాన్ని ఆక ర్షించాడు. జర్మనీ నియంత హిట్లర్ తన దేశంలో యూత్ ప్రోగ్రామ్‌ను ప్రా రంభించినప్పుడు ముందుగా ఫ్రైని సంప్రదించి, అతని సలహాలు సూచనలు తీసుకున్నాడు. నిజమైన ఆల్‌రౌండర్‌కు ఫ్రే పర్యాయపదమయ్యాడు.

-సత్య