ఆటాపోటీ

గవాస్కర్ రికార్డు (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంగ్లాండ్‌పై ఎక్కువ టెస్టులు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా గవాస్కర్ నెలకొల్పిన రికార్డు పదిలంగా ఉంది. అతను ఇంగ్లాండ్‌పై 38 మ్యాచ్‌లు ఆడితే, గుండప్ప విశ్వనాథ్ 30, కపిల్ దేవ్ 27, దిలీప్ వెంగ్‌సర్కార్ 26 చొప్పున టెస్టులు ఆడారు. ఇక ఇంగ్లాండ్ తరఫున భారత్‌పై డేవిడ్ గోవర్ అత్యధికంగా 24 టెస్టుల్లో పాల్గొన్నాడు. కాగా, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాను చూస్తే, భారత్ కంటే ఇంగ్లాండ్‌దే పైచేయిగా ఉంది. లార్డ్స్ మైదానంలో 1990లో జరిగిన మ్యాచ్‌లో గ్రాహం గూచ్ 333 పరుగులు చేశాడు. అంతకు ముందు 1967లో లీడ్స్ మైదానంలో జెఫ్ బాయ్‌కాట్ 246 (నాటౌట్) పరుగులతో భారత్‌పై నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును అతను అధిగమించాడు. 2011 ఆగస్టులో జరిగిన బర్మింహామ్ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ 294 పరుగులు చేసి, బాయ్‌కాట్‌ను మూడో స్థానానికి నెట్టేశాడు. కాగా, భారత్ తరఫున 1993 ముంబయి మ్యాచ్‌లో వినోద్ కాంబ్లి 224 పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌పై భారత బ్యాట్స్‌మన్ అత్యధిక స్కోరు ఇదే.

భారీ పార్ట్‌నర్‌షిప్
* భారత-ఇంగ్లాండ్ దేశాలు ఆడిన టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక భాగస్వామ్యం రికార్డు గుండప్ప విశ్వనాథ్, యశ్పాల్ శర్మ సొంతం చేసుకున్నారు. 1982 చెన్నై టెస్టులో వీరిద్దరూ మూడో వికెట్‌కు 316 పరుగులు జోడించారు. భారత్‌పై ఇంగ్లాండ్‌కు ఈ రికార్డు అలాన్ లాంబ్, గ్రాహం గూచ్ జోడీపై ఉంది. వీరు 1990 లార్డ్స్ టెస్టులో మూడో వికట్‌కు 308 పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడు వందలకుపైగా భాగస్వామ్యాలు నెలకొన్న సందర్భాలు ఇవి రెండే. మొదటి వికెట్ పార్ట్‌నర్‌షిప్ రికార్డు ఇంగ్లాండ్‌కు దక్కుతుంది. 1990 మాంచెస్టర్ టెస్టులో గ్రాహం గూచ్, మైకెల్ ఆథర్టన్ తొలి వికెట్‌కు 225 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

బౌలింగ్ హీరో..
* ఇంగ్లాండ్‌పై ఎక్కువ టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్ భగవత్ చంద్రశేఖర్. అతని ఖాతాలో 95 వికెట్లు ఉన్నాయి. ఆతర్వాతి స్థానం అనిల్ కుం బ్లే ఆక్రమిస్తాడు. ఇంగ్లాం డ్‌పై కుంబ్లే 92 వికెట్లు కూల్చా డు. ఇంగ్లాండ్ తరఫున భారత్‌పై బాబ్ విల్లీస్, డెరెక్ అండర్‌వుడ్ చెరి 62 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ల జాబితాలో చోటు సంపాదించారు. పుట్టుకతోనే వికలాం గుడైన చంద్రశేఖర్ అత్యుత్తమ స్పిన్నర్‌గా ఎదగడం విశేషం.

- సత్య