ఆటాపోటీ

సూపర్ బౌలర్ ట్రూమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడిన టెస్టుల్లో, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ ఫ్రెడ్ ట్రూమన్. 1952లో జరిగిన మాంచెస్టర్ టెస్టులో అతను 31 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు. చెన్నైలో వినూ మన్కడ్ 55 పరుగులకు 8, ఢిల్లీ టెస్టులో భగవత్ చంద్రశేఖర్ 79 పరుగులకు 8 చొప్పున వికెట్లు కూల్చి, మన దేశం తరఫున ఇంగ్లాండ్‌పై ఉత్తమ బౌలింగ్ విశే్లషణ నమోదు చేశారు. అయితే, మొత్తం మీద ఒక టెస్టులో ఎక్కువ వికెట్లు సాధించిన రికార్డు ఇయాన్ బోథమ్ పేరిట ఉంది. 1980 ముంబయి టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.
ఎక్‌స్ట్రాల వరద
బర్మింహామ్‌లో 2011లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు 63 పరుగులను ఎక్‌స్ట్రాల రూపంలో ధారాదత్తం చేశారు. ఈ రెండు దేశల మధ్య జరిగిన ఒక టెస్టులో ఇవే అత్యధిక ఎక్‌స్ట్రాలు. అదే మైదానంలో 1979లో భారత బౌలర్లు 60 పరుగులు ఎక్‌స్ట్రాలుగా ఇచ్చారు. 1990 ఓవల్ టెస్టులోనూ భారత్ ఇదే విధంగా ఎక్‌స్ట్రాల వరద పారించింది. 55 పరుగులను ఇంగ్లాండ్‌కు కట్టబెట్టింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లు భారత్‌కు 1996 లార్డ్స్ టెస్టులో 55 పరుగులను ఎక్‌స్ట్రాల రూపంలో అందించారు.
ఓపెనర్లతో సతమతం!
భారత జట్టు సరైన ఓపెనర్లు లేక సతమతమవుతున్నది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ, ఓపెనర్ల వైఫల్యం జట్టును వేధిస్తునే ఉంది. గత 14 టెస్టుల్లో ఐదు వేర్వేరు కాంబినేషన్స్‌తో ప్రయత్నాలు జరిగాయంటే, ఓపెనర్లు ఏ స్థాయిలో నిరాశ పరుస్తున్నారో ఊహించడం కష్టం కాదు. గాయం కారణంగా జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రాలేదు. అతను గత ఎనిమిది టెస్టుల్లో ఒకే ఒక అర్ధ శతకాన్ని సాధించాడు. మిగతా ఓపెనర్లతో పోలిస్తే మురళీ విజయ్ కొంత వరకు నిలకడగా ఆడుతున్నాడు. అతనితో కలిసి ఆజింక్య రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే, భారత్, ఇంగ్లాండ్ జట్లు దాదాపు సమతూకంగా కనిపిస్తున్నాయి. కొన్ని అంశాల్లో ఇంగ్లాండ్ పేసర్లది పైచేయిగా కనిపిస్తున్నది. ఒక రకంగా టీమిండియా బలం స్పిన్నర్లయితే, ఇంగ్లాండ్‌కు పేసర్లు అండగా నిలుస్తారు. బంగ్లాదేశ్ టూర్‌లో బెన్ స్టోక్స్ 11 వికెట్లు పడగొట్టాడు. భారత్‌లోనూ అతను కీలక భూమిక పోషించడం ఖాయం. తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడనున్న స్టువర్ట్ బ్రాడ్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అతను తనైన శైలిలో విజృంభిస్తే భారత బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు తప్పకపోవచ్చన్న అభి ప్రాయం వినిపిస్తున్నది.