ఆటాపోటీ

‘టీమ్ అథ్లెటిక్స్’లో బోల్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా, జపాన్, చైనా, ఇంగ్లాండ్ దేశాలు అథ్లెటిక్స్‌లో విప్లవాత్మక మార్పులకు తెరతీశాయి. మెల్బోర్న్‌లో టీమ్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొమ్మిది ఒలింపిక్ పతకాలు సాధించిన సూపర్ స్ప్రింటర్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ ఈ పోటీల్లో పాల్గొంటాడు. ఇప్పటి వరకూ బోల్ట్ ఆస్ట్రేలియాలో ఎన్నడూ పోటీకి దిగలేదు. మొదటిసారి అతను ఆస్ట్రేలియాకు వస్తాడని, దీనిపై ఇప్పటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ కనిపిస్తున్నదని ఈవెంట్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జాన్ స్టెఫెనె్సన్ అన్నాడు. కాగా, మొత్తం 24 మంది అథ్లెట్లు ఇందులో పోటీపడతారు. వీరిలో 12 మంది పురుషులుకాగా, మరో 12 మంది మహిళలు. సంప్రదాయ బద్ధంగా నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు కొంత భిన్నంగా టీమ్ అథ్లెటిక్స్‌కు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 9, 11 తేదీల్లో పోటీలు ఉంటాయి. బోల్ట్‌తోపాటు ప్రపంచ మేటి అథ్లెట్లు చాలా మంది ఇందులో పాల్గొంటారు. అథ్లెటిక్స్‌లో దీనిని ఒక సంచలనంగా క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు.