ఆటాపోటీ

బార్సిలోనాకు మెస్సీ గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా క్లబ్‌కు మెస్సీ దూరం కానున్నాడన్న వార్త సాకర్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది

స్పానిష్ సాకర్ క్లబ్ బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ తన కాంట్రాక్టును పొడిగించుకునే ఆలోచనలో లేడన్న వార్త గందరగోళానికి దారితీసింది. దీనిపై మెస్సీ నోరు మెదపకపోవడంతో బార్సిలోనాతో అతని కాంట్రాక్టుకు 2018లో తెరపడుతుందన్న వాదనకు మరింత బలం చేకూరుతున్నది. బార్సిలోనాతో మెస్సీ కాంట్రక్టును పొడిగించుకోక పోవచ్చని మార్సా ప్రతిక ప్రచురించిన వార్తా కథనం సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయాన్ని మెస్సీ ఇప్పటికే క్లబ్ యాజమాన్యానికి తెలిపాడని ఆ పత్రిక పేర్కొంది. స్పెయిన్‌లో మెస్సీ, అతని తండ్రి పన్ను ఎగవేత కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బార్సిలోనా క్లబ్‌లో కొనసాగితే, స్పెయిన్‌లోనే ఉండాల్సి వస్తుందని, కేసు మెడకు బిగుస్తుందని 29 ఏళ్ల మెస్సీ భయపడుతున్నట్టు సమాచారం. అందుకే, అతను బార్సిలోనాతో కాంట్రాక్టు పునరుద్ధరణకు ససేమిరా అంటున్నాడని తెలుస్తున్నది. బార్సిలోనా సాకర్ క్లబ్‌కు మెస్సీ గుడ్‌బై చెప్పబోతున్నాడన్న వార్తను అతను ఖండించలేదు. ధ్రువీకరించనూలేదు. అతను స్పందించకపోవడానికి విశే్లషకులు ప్రాధాన్యతనిస్తున్నారు. కాంట్రాక్టు గడువు పూర్తయిన తర్వాత దానిని పొడిగించుకునే ఆలోచన అతనికి లేదని అంటున్నారు. ఇటు మెస్సీగానీ, అటు బార్సిలోనా యాజమాన్యంగానీ స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఈ సస్పెన్స్‌కు తెరపడదు.