ఆటాపోటీ

ఆశ చావలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక స్పిన్నర్‌గా సేవలు అందించి, బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా నిషేధానికి గురైన సయిద్ అజ్మల్‌కు జాతీయ జట్టులో స్థానంపై ఇంకా ఆశ చావలేదు. రిటైర్మెంట్ ఆలోచన తనకు ఏమాత్రం లేదని 39 ఏళ్ల అజ్మల్ స్పష్టం చేస్తున్నాడు. 2014లో సస్పెన్షన్‌కు గురైన అతను ప్రత్యేకంగా నిపుణుల వద్ద శిక్షణ పొంది, బౌలింగ్ యాక్షన్‌ను చక్కదిద్దుకున్నాడు. మారిన అతని బౌలింగ్ యాక్షన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అతనిపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిరుడు తొలగించింది. అదే ఏడాది ఏప్రిల్ మాసంలో అజ్మల్ చివరిసారి బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. ఆతర్వాత సెలక్టర్లు అజ్మల్‌ను పట్టించుకోలేదు. బౌలింగ్ చేసే విధానాన్ని మార్చుకున్న తర్వాత అతని బంతుల్లో పదును తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. తన బౌలింగ్ గతంలో మాదిరి లేదన్న విమర్శలకు తెరదించే ప్రయత్నం చేసిన అజ్మల్ ఈ ఏడాది దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయ జట్టులో అజ్మల్‌కు తిరిగి చోటు దక్కే అవకాశాలకు పూర్తిగా తెరపడలేదని పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ చేసిన ప్రకటన అతనిలో ఆశలు రేపింది. అందుకే, ఇప్పట్లో రిటైర్ కానని అతను స్పష్టం చేస్తున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించే సత్తా ఇంకా తనకు ఉందని అంటున్న అజ్మల్‌కు సెలక్టర్లు మళ్లీ అవకాశం కల్పిస్తారా లేక అతనిని ఉత్సాహ పరచడాన్ని మాటలకే పరిమితం చేస్తారా అన్నది చూడాలి.
అజ్మల్ ఇప్పటి వరకూ 35 టెస్టులు ఆడి 451 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 పరుగులు. 113 వనే్డల్లో 324 (అత్యధికం 33 పరుగులు), 64 టి-20 మ్యాచ్‌ల్లో 91 (అత్యధికం 21 నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. టెస్టుల్లో 11,592 బంతులు బౌల్ చేసి, 5,003 పరుగులిచ్చి 173, వనే్డల్లో 6,000 బంతులు వేసి, 4,182 పరుగులిచ్చి 184, టి-20 ఫార్మాట్‌లో 64 మ్యాచ్‌లు ఆడి, 1,430 బంతులు వేసి, 1,516 పరుగులిచ్చి 85 చొప్పున వికెట్లు సాధించాడు.