ఆటాపోటీ

జట్టులోకి మరొకరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రపంచ ట్రెకింగ్ చాంపియన్‌షిప్ పోటీలను బృందాలకు నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో నలుగురు ఉంటారు. కానీ, స్వీడన్ బృందంలోకి ఓ అనుకోని అతిథి వచ్చి చేరడం అందరి దృష్టినీ ఆకర్షించింది. రాళ్లురప్పలు, ముళ్లపొదలు, బురద గుంటలతో, కొండ మలుపులతో కూడిన 430 మైళ్ల దూరం ట్రెకింగ్ చేసేందుకు అద్వితీయ ప్రతిభ, తిరుగులేని శక్తిసామర్థ్యాలేకాదు.. అంతులేని ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. స్వీడన్ జట్టులోని నలుగురు ట్రెకర్లు పోటీ ప్రారంభమైన కొంత సేపటి తర్వాత భోజనం చేయడానికి ఉపక్రమించారు. అదే సమయంలో అక్కడ ఒక కుక్క దీనంగా తమనే చూడడాన్ని గమనించి, దానికీ తిండి పెట్టారు. అంతే.. ఆ క్షణం నుంచి ఆ కుక్క వారిని విడిచిపెట్టలేదు. వందల మైళ్లు వారితో కలిసి నడిచింది. కొండలెక్కింది. లోయల్లోకి దిగింది. కాళ్లు రక్తమోడుతున్నా పట్టించుకోలేదు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఆ నలుగురూ దానిని పెంచుకోవడానికి పోటీపడ్డారు. దానికి ‘ఆర్థర్’ అని పేరు పెట్టుకొని, వంతుల వారీగా పెంచుకుంటున్నారట.

స్టాండింగ్ జంప్..
* హైజంప్‌లో అథ్లెట్లు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నేలకు ఒక కాలిని బలంగా అదుముతూ పైకి ఎగురుతారు. కానీ, నిల్చున్న చోటు నుంచి కదలకుండా పైకి ఎగరే ఆట కూడా ఉంది. దీనినే స్టాండింగ్ జంప్ అంటారు. కెనడాలోని ఓక్‌విల్లేలో ఇవాన్ ఉన్గర్ అనే 24 ఏళ్ల యువకుడు 1.61 మీటర్లు (61.5 అంగుళాలు) ఎత్తు ఎగిరాడు. ఈ జంప్ గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించింది.

యుద్ధం తెచ్చిన మ్యాచ్!
* హోండురాస్, ఎల్ సాల్వడార్ మధ్య 1969లో హఠాత్తుగా యుద్ధ నగారా మోగింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు తూటాలు పేల్చుకున్నారు. ట్యాంకులతో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. ఇంతకీ, ఇంత హఠాత్తుగా యుద్ధం ఎందుకు జరిగిందని ఆరాతీస్తే, రెండు దేశాల మధ్య వరల్డ్ కప్ ప్లే ఆఫ్‌లో జరిగిన మ్యాచ్ ఫలితమేనని తేలింది. ఆ మ్యాచ్‌లో హోండురాస్‌ను ఎల్ సాల్వడార్ ఓడించింది. ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయిన హోండురాస్ జవాన్లు కాల్పులకు దిగారు. ఎల్ సాల్వడార్ సైన్యం గట్టిగానే సమాధానమిచ్చింది. సంగతి తెలిసిన ఇరు దేశాల నాయకులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

- సత్య