ఆటాపోటీ

డోప్ నీడలో వెయిట్‌లిఫ్టింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతా క్రీడలతో పోలిస్తే లిఫ్టర్లలోనే డోపింగ్ వాడకం ఎక్కువగా ఉండడం ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్)ను ఆందోళనకు గురి చేస్తున్నది. చాలాకాలంగా డోపింగ్ నీడలోనే వెయిట్‌లిఫ్టింగ్ మనుగడ సాగిస్తున్నది. 1896లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రీడలో గతంలో ఎన్నడూ లేనంతగా డోపింగ్ కేసులు బయటపడుతున్నాయి. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సేకరించిన శాంపిల్స్‌లో ఇప్పటికే 104 కేసులు వెలుగుచూశాయి. వీటిలో 48 కేవలం వెయిట్‌లిఫ్టర్లకు చెందినవే కావడం విశేషం. డోపింగ్ దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పతకాలు సాధించిన వారే. మొత్తం 1,243 మంది లిఫ్టర్ల శాంపిల్స్‌ను సేకరించి, పరీక్షించారు. అయితే, ఇంకా పూర్తిగా అన్ని శాంపిల్స్ ఫలితాలను వెల్లడించలేదు. బయటపడిన కేసుల్లో అత్యధిక శాతం వెయిట్‌లిఫ్టింగ్ విభాగానికి చెందినవే. కజకిస్థాన్‌కు చెందిన లియా లియిన్ పేరును ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. నాలుగు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న అతను బీజింగ్, లండన్ ఒలింపిక్స్ 94 కిలోల విభాగంలో స్వర్ణ పతకాలను సాధించాడు. అయితే, డోపింగ్‌లో పట్టుబడిన కారణంగా వాటిని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే విభాగంలో రష్యా లిఫ్టర్ అలెక్సాండర్ రజతాన్ని, మాల్డోవాకు చెందిన అనతొలి సిరికూ కాంస్యాన్ని సాధించారు. కానీ, వారిద్దరు కూడా డోపింగ్‌లో దొరికిపోయిన కారణంగా పతకాలను కోల్పోవాల్సి వచ్చింది. నాలుగో స్థానంలో ఉన్న లిఫ్టర్ కూడా దోషిగా తేలడంతో, ఐదో స్థానంలో ఉన్న సయిద్ మహమ్మద్‌పొర్ (ఇరాన్)కు ఒలింపిక్స్ అధికారులు స్వర్ణ పతకాన్ని అందించారు. తొమ్మిదో స్థానంలో ఉన్న తొమాజ్ జిలిన్‌స్కీ (పోలాండ్)కు రజత పతకం దక్కింది. దీనిని బట్టి, బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 94 కిలోల విభాగంలో పోటీపడిన టాప్-10లో ఎంత మంది నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడారో ఊహించుకోవచ్చు. లిఫ్టర్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే, డోపింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) డైరెక్టర్ జనరల్ ఆలివర్ నిగ్లీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తాత్సాలిక శక్తిసామర్థ్యాలను అందించే ఉత్ప్రేరకాలను వాడడం వల్ల దీర్ఘకాలంలో నష్టాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. డ్రగ్స్ వాడిన వారు తిరిగి సాధారణ జీవితం గడపడం చాలా కష్టం. వివిధ రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇన్ని కష్టనష్టాలు ఉంటాయని తెలిసినప్పటికీ, డోపింగ్‌కు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ సమస్య మిగతా అన్ని క్రీడల్లో ఉన్నప్పటికీ, వెయిట్‌లిఫ్టింగ్‌లో మరీ ఎక్కువ. డోప్ దోషుల్లో రష్యా, కజకిస్థాన్, బల్గేరియా తదితర దేశాలకు చెందిన లిఫ్టర్లు అధికం. దీని వెనుకగల కారణాలను వెలికితీయడానికి కృషి చేస్తున్నట్టు ఐడబ్ల్యుఎఫ్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సైతం డోపింగ్ రహిత ఒలింపిక్స్‌ను నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. కానీ, పెరుగుతున్న డోపింగ్ కేసులు అటు వాడాను, ఇటు ఐడబ్ల్యుఎఫ్‌ను, మరోవైపు ఐఒసిని ఆందోళనకు గురి చేస్తున్నాయ. 2020 ఒలింపిక్స్‌లో ఒక్క డోపింగ్ కేసు కూడా లేకుండా చేస్తామని, ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించింది. కానీ, ఇది సాధ్యమా అన్నదే ప్రశ్న. ఏది ఏమైనా, క్రీడాస్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిన డోపింగ్‌కు తెరదించాల్సిన బాధ్యత అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాల అధికారులపై ఉంది. ఇందుకు ప్రభుత్వాలు కూడా సహకరించాలి.

- శ్రీహరి