ఆటాపోటీ

ప్రాంతీయాభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్‌కు ప్రాంతీయాభిమానం ఎక్కువ. నార్త్ కరోలినాకు చెందిన అతను అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఎక్కువగా అతను ఆ ప్రాంతం పేరును ముద్రించిన నిక్కర్లనే వాడేవాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చికాగో బుల్స్ దుస్తులు వేసుకునేవాడు. అయితే, నార్త్ కరోలినా నిక్కరు వేసుకొని, దానిపై బుల్స్ యూనిఫామ్ ధరించి మ్యాచ్‌లు ఆడేవాడు. అతనికి ఉన్న ప్రాంతీయాభిమానం అలాంటిది. ‘నేను విఫలమయ్యాను.. మళ్లీ మళ్లీ మళ్లీ విఫలమయ్యాను.. ఎన్నో ఓటముల తర్వాతే విజయాలు లభించాయి’ అంటూ యువతకు స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పిన అతనికి ఇంత ప్రాంతీయాభిమానం ఏమిటో!

బ్రష్ చేసుకుంటేనే..
ఎవరైనా నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటారు. కొంత మంది రాత్రి నిద్రపోయే ముందు కూడా పళ్లు తోముకుంటారు. కానీ, బేస్‌బాల్ పిచర్ టర్క్ వెండెల్‌కు ఒక విచిత్రమైన అలాటు ఉండేది. ప్రతి మ్యాచ్‌లోనూ ఆట ప్రారంభానికి ముందు అతను బ్రష్ చేసుకునేవాడు. అంతేగాక, ప్రతి ఇన్నింగ్‌లోనూ హడావుడిగా వాష్‌రూమ్‌లోకి పరిగెత్తి గబగబా పళ్లు తోముకొని వచ్చేవాడు. బ్రష్ చేసుకోవడం ఆ వెంటనే మింట్‌ను చప్పరించడం అతని అలవాటు కాదు... నమ్మకం. అలా చేస్తేనే మ్యాచ్‌లో రాణిస్తాననీ లేకపోతే విఫలమవుతానని అతను గాఢంగా నమ్మేవాడు.

చికెన్ తిని మ్యాచ్‌కి..
న్యూయార్క్ యాంకీస్ తరఫున ఆడిన అమెరికా బేస్‌బాల్ ఆటగాడు వేడ్ బాగ్స్ ప్రతి మ్యాచ్‌కి ముందు తప్పనిసరిగా చికెన్ తినేవాడు. అది లేకుండా భోజనం ముగిస్తే, మ్యాచ్‌లో గొప్పగా ఆడలేనని థర్డ్‌బేస్‌లో మేటిగా పేరు సంపాదించిన బాగ్స్ నమ్మేవాడు. అంతేకాదు.. బ్యాట్‌కు వచ్చే ముందు గ్రౌండ్‌పై కాలి బొటన వేలితో ‘టు లైఫ్’ అని రాసేవాడు. ఈ అలావాటే తనకు అదృష్టం తెచ్చిపెట్టిందని అతని విశ్వాసం. కెరీర్ మొత్తంలో ఎన్నడూ అతను ఆ అలవాటును మానుకోలేదు.

- సత్య