ఆటాపోటీ

' ఫిఫా'లో ఎత్తులు, పైఎత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)పై పట్టు సంపాదించేందుకు పలువురు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులతో పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈనెల 26న జ్యూరిచ్‌లో జరిగే ఫిఫా ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా, రేసులో ఉన్నవారంతా సమస్యలను గాలికొదిని, స్వలాభాన్ని ఆశిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించడానికి ఎవరూ ప్రయత్నించడం లేదన్నది వాస్తవం. ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సెప్ బ్లాటర్‌ను వేటాడి, వెంటాడి చివరికి అతనితో రాజీనామా చేయించినా, ఫిఫాను ఆదుకునే మంత్ర దండం అదక్కొటే అనుకోవడం తప్పు. బ్లాటర్ రాజీనామా ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా నిరసలు హోరెత్తుతున్నా అధ్యక్ష పదవికి పోటీపడ్డాడు బ్లాటర్. ప్రధాన ప్రత్యర్థి, జోర్డాన్ యువరాజు అలీ బిన్ హుస్సేన్‌కు 73 ఓట్లు వస్తే, బ్లాటర్‌కు 133 ఓట్లు లభించాయి. ఆరోపణలకూ, ఎన్నికలకు ఎక్కడా పొంతన ఉండదనే వాస్తవాన్ని అతని ఎన్నిక మరోసారి రుజువు చేసింది. ఫిఫా అధ్యక్ష స్థానానికి తన పేరును ప్రకటించుకున్న క్షణం నుంచి, తిరుగులేని విజయాన్ని సాధించేంత వరకూ అతను చాలానే కష్టపడ్డాడు. 79 ఏళ్ల వయసులోనూ అవిశ్రాంతంగా దేశదేశాలు తిరిగాడు. అన్ని దేశాలకు చెందిన ఫుట్‌బాల్ సంఘాలను, వివిధ ఖండాల కానె్ఫడరేషన్స్‌ను మెప్పించాడు. తనకు అనుకూలంగా ఓటు వేయించుకోగలిగాడు. 1975లో కార్యవర్గ సభ్యుడిగా ఫిఫాలో అడుగుపెట్టిన బ్లాటర్ 1989లో మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి ప్రపంచ సాకర్‌ను ఏక ఛత్రాధిపత్యాంగా ఏలాడు. ఎంతోకాలంగా ఫిఫాను పట్టి పీడిస్తున్న చాలా సమస్యలను అతను పరిష్కరించాడు.
ఆరోపణలు కొత్తకాదు..
అవినీతి ఆరోపణలు, ముడుపుల కుంభకోణాలు ఫిఫాకు కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో ఆరోపణలు వెల్లువెత్తడం, అంతే హఠాత్తుగా చల్లబడిపోవడం ఆనవాయితీగా మారింది. అయితే, తాజా ఉదంతం మాత్రం అంత త్వరగా ఫిఫాను వీడేదిగా కనిపించడం లేదు. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీల నిర్వాహణ హక్కులను కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నారని కార్యవర్గ సభ్యులపైనే ఆరోపణలు రావడం సంస్థ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. 2018 వరల్డ్ కప్ హక్కులను రష్యా సంపాదించుకుంటే, 2022లో మెగా టోర్నీ నిర్వాహణ బాధ్యతను కతార్ సొంతం చేసుకుంది. అమెరికాసహా పలు దేశాలు పోటీపడినప్పటికీ ఫలితం లేకపోయింది. తమను కాదని రష్యాకు ఏ విధంగా ఒలింపిక్స్ హక్కులను కట్టబెడతారని ఆగ్రహంతో ఉన్న అమెరికా పూర్తి స్థాయిలో దర్యాప్తును ఆరంభించింది. ఫలితంగా అరెస్టులు, సస్పెన్షన్లు, బహిష్కరణలు కొనసాగుతున్నాయి. రష్యాకు అనుకూలంగా ఓటు వేయడానికి ఫిఫా కార్యవర్గ సభ్యులు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమెరికా నిఘా విభాగం కూడా ఈ విషయాన్ని ప్రాథమికంగా గుర్తించింది. రష్యాలో సదుపాయాలు, వసతులు మెరుగ్గానే ఉంటాయి కాబట్టి, ప్రపంచ కప్ సాకర్‌ను అక్కడ నిర్వహించడం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం ఉంది కాబట్టే రష్యాను ఎంపిక చేశామని ఫిఫా అధికారులు వాదించవచ్చు. కానీ, కతార్ ఎంపికను ఏవిధంగానూ సమర్థించుకునే పరిస్థితి లేదు. అక్కడ వౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. పైగా భద్రతాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి.
అమెరికా లాబీయింగ్
ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ నిర్వాహణ హక్కుల కోసం అమెరికా పెద్ద ఎత్తునే లాబీయింగ్ చేసింది. బిడ్ వేసిన అమెరికా 17 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు అనధికార సమాచారం. అధికారికంగా 10 మిలియన్లను లాబీయింగ్ కోసం వెచ్చించినట్టు అమెరికా ప్రకటించింది. కతార్ నుంచి అంతకంటే ఎక్కువ సొమ్మును తీసుకొని, కార్యవర్గ సభ్యులంతా ఆ దేశానికి మద్దతు పలికారని అమెరికా ఆరోపణ. ఆర్థికపరమైన అవినీతికి, కుంభకోణాలకు పాల్పడిన ఫిఫా కార్యవర్గ సభ్యులపై అమెరికా మండిపడుతున్నది. ద్రోహం చేసిన ఫిఫా కార్యవర్గం అంతు చూడాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, ఆంతరంగిక మోసాల నిరోధక నిఘా విభాగానికి విచారణ బాధ్యతను అప్పగించింది.
కదిలిన డొంక
అవినీతి ఆరోపణల నేపథ్యంలో అమెరికా నిఘా విభాగం అవినీతి తీగె లాగింది. దీనితో భారీ కుంభకోణ డొంక కదిలింది. ఫిఫా మాజీ కార్యవర్గ సభ్యులు జాక్ వార్నర్, నికోలాస్ లియోజ్‌లపై ఉన్న పలు ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి. భారీగా ముడుపులు తీసుకున్న తర్వాతే రష్యా, కతార్ దేశాలకు ప్రపంచ కప్‌ను నిర్వహించే హక్కులను ఇవ్వడానికి అనుకూలంగా ఓటు వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మందిని అమెరికా నిఘా విభాగం సూచనతో జ్యూరిచ్ పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కూడా అరెస్టులు కొనసాగాయి. నిందితుల జాబితాలో మరికొన్ని పేర్లు చేరాయి. తాజా జాబితాలో వార్నర్, లియోజ్ ఉన్నట్టు సమాచారం. నిజానికి వీరిద్దరి కోసం ఇంటర్‌పోల్ ఇప్పటికే ‘రెడ్ కార్నర్ నోటీసు’ జారీ చేసింది. ఆర్థిక నేరాల్లో పేరుమోసిన వారంతా ఫిఫాలో కార్యవర్గ సభ్యులుగా ఉన్న లేదా ఉంటున్న వారు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. మొత్తానికి నిలువునా మునిగిపోతున్న ఫిఫాను ఒడ్డున చేర్చే ప్రయత్నం మాత్రం జరగడం లేదు. సంస్థపై ఆధిపత్యాన్ని సంపాదించడానికి, అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడానికి అభ్యర్థులంతా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారే తప్ప పరిష్కార మార్గాలను చూపించడం లేదు. మొత్తం తప్పునంతా బ్లాటర్ మీదకు తోసేయడమే తాము తప్పించుకోవడానికి మంచి మార్గంగా ఎంచుకున్నారు. చాలా సంక్లిష్టపైన పరిస్థితుల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు సహజంగానే ఉత్కంఠ రేపుతున్నాయి.

ఎవరి వ్యూహం వారిది
ఫిఫాకు కొత్త ఊపిరి పోద్దామన్న ధ్యాస లేకపోయినా, ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది అభిమానాన్ని చూరగొన్న సాకర్‌ను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునే దిశగా, అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారంతా వ్యూహరచనల్లో మునిగితేలుతున్నారు. ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ అధ్యక్షుడు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్-ఖలీఫా, యూఫా ప్రధాన కార్యదర్శి గియానీ ఇన్ఫాంటినో మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఫిఫా మాజీ ఉపాధ్యక్షుడు అలీ బిన్ అల్ హుస్సేన్ (జోర్డాన్), దక్షిణాఫ్రికా రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త టోక్యో సెక్స్‌వేల్, ఫిఫా మాజీ కార్యవర్గ సభ్యుడు జెరోమ్ చాంపెన్ (ఫ్రాన్స్) కూడా పోటీపడుతున్నారు. ఐదుగురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తొలుత అనుకున్నప్పటికీ, ఇప్పుడు అల్ ఖలీఫా, ఇన్ఫాంటినో మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని స్పష్టమవుతున్నది. అయితే, యూఫా అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ చివరి క్షణం వరకూ అధ్యక్ష పదవికి పోటీలో ఉండడం, చివరికి అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడం వంటి అంశాలను అల్ ఖలీఫా తన అస్త్రాలుగా మార్చుకొని ముందుకు దూసుకెళుతున్నాడు. మూడు నెలల్లో ఫిఫాను ప్రక్షాళన చేస్తానంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఇన్ఫాంటినో, ఆ దిశగా తాను అనుసరించబోయే వ్యూహాలను మాత్రం వెల్లడించడం లేదు. దశాబ్దాల తరబడి వేళ్లూనుకున్న అవినీతిని మూడు నెలల వ్యవధిలో నిర్మూలించడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఏ విధంగా చూసినా అవినీతి ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఫిఫా ఎప్పుడు ఒడ్డున పడుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. అధ్యక్ష పదవికి ఈనెల 26న జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్న ఐదుగురు అభ్యర్థుల్లో ఎవరైనా ఫిఫా ప్రక్షాళనకు చిత్తశుద్ధితో కృషి చేస్తారా అన్నది అనుమానమే. అందరూ స్వార్థ పరులైనప్పుడు, తక్కువ స్వార్థం ఉన్న వారిని ఎన్నుకోవడమే ఉత్తమమని ఫిఫా సభ్య దేశాలు అనుకుంటాయేమో!

- మనోహర్