ఆటాపోటీ

టెన్నిస్ సంచలనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్నిస్‌లో ఈ ఏడాది సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్ తెరమరుగయ్యాడు. ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా వెనుకబడి, రెండో స్థానానికి పడిపోయాడు. ఆ స్థానాన్ని బ్రిటిష్ సూపర్ స్టార్ ఆండీ ముర్రే సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సుమారు దశాబ్దకాలంగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సెరెనా విలియమ్స్ నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశ పరచింది. ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఏంజెలిక్ కెర్బర్ నంబర్ వన్‌గా ఎదిగింది. జొకోవిచ్, సెరెనా నంబర్ వన్ స్థానాలను చేజార్చుకోవడం, ముర్రే, కెర్బర్ అద్వితీయ ప్రతిభతో ముందంజ వేయడం ఈ ఏడాది టెన్నిస్‌లో అద్భుతాలుగా చెప్పుకోవాలి.