ఆటాపోటీ

జీతూ ఎంపిక ఆశ్చర్యకరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్త్న్రకు సింధు, సాక్షి, దీప ఎంపిక కావడం పట్ల ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, షూటర్ జీతూ పేరు ఈ జాబితాలో చేరడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రియో ఒలింపిక్స్‌లో సింధు, సాక్షి పతకాలను సాధించగా, దీప తుది వరకూ పోరాడింది. అందుకే ఈ ముగ్గురికీ ఖేల్ రత్న అవార్డును ముందుగా ఊహించిందే. కానీ, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్‌లో దారుణంగా విఫలమైన జీతూ ఎనిమిదో స్థానంతో సంతృప్తి చెందాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని అందుకోవడం మినహా అతను సాధించిన అద్భుతాలు లేవు. రియోలో రాణించలేకపోయినా అతనిని ఖేల్త్న్రకు ఎందుకు ఎంపిక చేశారన్నది మిస్టరీగా మారింది.