ఆటాపోటీ

ఓడి గెలిచిన దీప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పతకం సాధించడంలో విఫలైంది. ఎంత కష్టపడినా ఫలితం లేక, నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. అయతే, ఆమె పోరాట పటిమకు యావత్ దేశం నీరాజనాలు పలికింది. అత్యంత క్లిష్టమైన ‘ప్రొడునొవా’ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆమె వాల్ట్ విభాగంలో తృటిలో కాంస్యన్ని కోల్పోయిన వైనాన్ని కోట్లాది మంది భారతీయులు టీవీల్లో ఉత్కంఠతో చూశారు. నాలుగో స్థానానికే పరిమితమైనప్పటికీ, అద్వితీయ ప్రతిభతో, అనితర సాధ్యమైన పోరాట పటిమతో ఆమె అభిమానుల మనసు కొల్లగొట్టింది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని రాష్టప్రతి నుంచి సగర్వంగా అందుకుంది.