ఆటాపోటీ

‘ఖేల్ రత్న’ సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈఏడు అంతర్జాతీయ క్రీడా రంగాన్ని అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్, జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఏలితే, మన దేశానికి సంబంధించినంత వరకూ తెలుగు అమ్మాయి పివి సింధుదే అగ్రస్థానం. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఈ హైదరాబాదీ లక్షలాది మందికి రోల్ మోడలైంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి, రియోలో టైటిల్ ఫేవరిట్‌గా ముద్ర వేయించుకున్న సైనా నెహ్వాల్‌ను మోకాలి నొప్పి వేధిస్తున్న తరుణంలో, బాడ్మింటన్‌లో రాణించే బాధ్యతను సింధు తన భుజాలపై వేసుకుంది. తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ ఫైనల్ చేరింది. ఒలింపిక్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించిన తొలి భారత బాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో కరోలినా మారిన్‌కు గట్టిపోటీనిచ్చినప్పటికీ పరాజయాన్ని ఎదుర్కొన్న సింధు రజత పతకాన్ని దేశానికి అందించింది. అందుకే, దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్త్న్రను ఆమె అందుకుంది. 119 మంది సభ్యులతో కూడిన బృందం రియోకు ఎంపికైతే, 117 మంది వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్నారు. వీరిలో సింధు మాత్రమే రజత పతకాన్ని సాధించగలిగింది. ఆమెను ఈఏటి మేటి అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను రియోకు మోసుకెళ్లి, చివరి వరకూ శక్తి వంచన లేకుండా శ్రమించి, రజత పతకంతో తిరిగి వచ్చిన సింధుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జేజేలు పలికారు.