ఆటాపోటీ

ఇద్దరూ ఇద్దరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది క్రీడా ప్రపంచాన్ని శాసించిన వారి జాబితాలో మొదటి రెండు స్థానాలు అమెరికా స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్, స్ప్రింట్ రారాజు ఉసేన్ బోల్ట్‌కే దక్కుతాయి. రియో ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఐదు స్వర్ణాలు, ఒక రజతంతో కలిసి మొత్తం ఆరు పతకాలు సాధించాడు. మరెవరికీ సాధ్యంకాని రీతిలో అతను మొత్తం 28 ఒలింపిక్ పతకాలను గెల్చుకొని, తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. వాటిలో 23 స్వర్ణాలు. మూడు రజతాలుకాగా, రెండు కాంస్య పతకాలు. ఆరు అడుగలా నాలుగు అంగుళాల పొడవుతో, స్విమ్మింగ్‌కు తగిన శారీరాకృతిగల ఫెల్ప్స్ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించాడు. కానీ, మనసు మార్చుకొని మళ్లీ కెరీర్‌ను కొనసాగించాడు. రియోలో పసిడి పంట పండించాడు.
ఈ భూమండలం మీద తన కంటే వేగంగా పరిగెత్తే మనిషే లేడని ‘జమైకా చిరుత’ బోల్ట్ మరోసారి రుజువు చేసుకున్నాడు. 100, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న బోల్ట్ రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలను స్వీకరించాడు. గోల్డెన్ ‘ట్రిపుల్’ను సాధించడంలో అతను హ్యాట్రిక్ సృష్టించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ స్వర్ణ పతకాలను గెల్చుకొని, ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మరోసారి ఆ మూడు ఈవెంట్స్‌లోనూ స్వర్ణాలను కైవసం చేసుకొని, ‘ట్రిపుల్ డబుల్’ను నమోదు చేసి, రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఈ ఏడు రియోలో మళ్లీ అదే ఫీట్‌ను సాధించి, ఇప్పటి వరకూ అంతా అసాధ్యంగా భావించే రికార్డును సుసాధ్యం చేసి చూపించాడు. సహజంగానే అథ్లెట్ల కెరీర్ చాలా తక్కువ. ఇక 100, 200 మీటర్ల పరుగులో పోటీపడే షార్ట్ డిస్టెన్స్ రన్నర్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఫిట్నెస్ సమస్యలు చాలా తొందరగా వారిని చుట్టుముడతాయి. గాయాలు వెంటాడి వేధిస్తాయి. స్ప్రింట్‌కు తగినట్టు శరీరాన్ని కాపాడుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ, బోల్ట్ అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించాడు.
షార్ట్ డిస్టెన్స్ పరుగులో తనను మించిన మొనగాడు లేదని రుజువు చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాల ‘ట్రిపుల్’ను మూడు పర్యాయాలు సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఎవరూ కలలో కూడా ఊహించని అద్భుతాలను ఈ ఏడాది కళ్ల ముందు ఆవిష్కరింప చేసిన ఫెల్ప్స్, బోల్ట్ నెలకొల్పిన రికార్డులు చిరస్థాయిగా ఉండిపోతాయేమో!