ఆటాపోటీ

వినేష్‌పై ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు యావత్ దేశం జేజేలు పలికింది. అయితే, రియోకు వెళ్లిన రెజ్లర్లలో తప్పనిసరిగా పతకాన్ని సాధించే సత్తా ఉందన్న పేరు మాత్రం వినేష్ ఫొగట్‌కు మాత్రమే పరిమితమైంది. ‘్ఫగట్ సిస్టర్స్’లో బబిత, గీత తర్వాత ఆ స్థాయిలో రాణించే సత్తావున్న రెజ్లర్ వినేష్. రియోలో మహిళల 48 కిలోల విభాగంలో ఆమె హాట్ ఫేవరిట్‌గానే బరిలోకి దిగింది. కానీ, మోకాలికి తీవ్రమైన గాయం తగలడంతో అనుకున్నది సాధించలేకోయింది. ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలే కాబట్టి, అంతర్జాతీయ వేదికలపై పతకాలను కొల్లగొట్టగలదని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ శక్తిసామర్థ్యాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి.

రికార్డుల హీరో
* ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన కరుణ్ నాయర్ చివరి మూడు టెస్టుల్లో బరిలోకి దిగాడు. వాటిలో అతను ఆడిన మొదటి రెండు టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్ మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఆ రెండు ఇన్నింగ్స్‌లోనూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన అతను, చివరిదైన చెన్నై టెస్టులో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ట్రిపుల్ సెంచరీ సాధించి, ఎన్నో కొత్త రికార్డులను నెలకొల్పాడు.

సంచలనాల బోరిస్
* బోరిస్ సింగ్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. 17 ఏళ్ల ఈ యువకుడు క్రికెటర్ లేదా టెన్నిస్ ఆటగాడు కాకపోవడంతో, సామర్థ్యానికి తగిన గుర్తింపును సంపాదించలేకపోయాడు. అయితే, ఫుట్‌బాల్ గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్న వారికైనా అతని పేరు ఖచ్చితంగా తెలుసు. స్వదేశంలో జరిగే అండర్-17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో బోరిస్ కీలక ఆటగాడు. మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లి, ప్రత్యర్థి గోల్‌పోస్టుపై దాడులు చేయడంలో అతను దిట్ట. వింగ్ బ్యాక్‌లోనూ బోరిస్ సమర్థుడే. అండర్-17 వరల్డ్ కప్‌లో హీరోలుగా మిగిలే వారిలో అతని పేరు ఖాయం.

- సత్య