ఆటాపోటీ

2017 ఆశాకిరణాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2016లో అద్భుతాలు సృష్టించి, భారత క్రీడా రంగంపై తమ ప్రత్యేకతను చాటుకున్న పలువురు స్టార్లు కొత్త సంవత్సరంలోనూ దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి అపూర్వమైన ప్రతిభాపాటవాలు ఎంతో మంది యువతీయువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయ. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయ, బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మరోసారి అంతర్జాతీయ వేదికలపై మెరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెటర్లు టెస్టు విభాగంలో దేశాన్ని నంబర్ వన్ స్థానానికి చేర్చారు. హాకీలో పురుషులు, మహిళల విభాగాల్లోనేగాక, జూనియర్స్ విభాగంలోనూ భారత్ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. 2017లో అదే ఒరవడిని కొనసాగించే దిశగా క్రికెటర్లు, హాకీ క్రీడాకారులు ప్రయాణం కొనసాగిస్తారనడంలో సందేహం లేదు. కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్న కొంత మంది స్టార్లు వీరే...

ప్రొఫెషనల్ బాక్సర్‌గా సత్తా నిరూపించిన విజేందర్ సింగ్ డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ టైటిల్‌ను సాధించి భారత బాక్సింగ్‌కు సరికొత్త దిశా నిర్దేశనం చేశాడు. కొత్త సంవత్సరంలో అతను టైటిల్‌ను నిలబెట్టుకోవడమేగాక, మరింత ఎత్తుకు ఎదుగుతా డని అభిమానుల ఆశ

సానియా మీర్జా గురించి తెలియనివారు, ఆమె సాధించిన విజయాలను గుర్తించనివారు ఉండరు. గ్రాండ్ శ్లామ్స్‌పై దృష్టి పెట్టి, టైటిళ్ల వేటను కొనసాగిస్తున్న ఈ హైదరాబాదీ కొత్త సంవత్సరంలో తిరుగులేని తన ప్రయాణాన్ని కొనసాగించి టైటిళ్లను సాధిస్తుందని ఆశిద్దాం

పివి సింధు గురించి ఎంత చెప్పినా తక్కువే. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకుంది. కొత్త సంవత్సరంలో ఆమె నుంచి అభిమానులు మరిన్ని విజయాలను ఆశిస్తున్నారు. అదే విధంగా గతంలో సైనా నెహ్వాల్ సాధించిన విధంగానే సింధు కూడా ప్రపంచ నంబర్ వన్‌గా ఎదుగుతుందని నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సింధు రాణించాలని కోరుకుందాం

రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్‌తో సమానంగా ప్రజల నీరాజనాలు అందుకున్న ఘనత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కే దక్కుతుంది. క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్, హాకీ వంటి అతి కొద్ది క్రీడలకే తప్ప మిగా వారికి ఆదరణ ఏమాత్రం లేని మన దేశంలో జిమ్నాస్టిక్స్‌కు స్థానం కల్పించిన ప్రతిభ ఆమె సొంతం

భారత క్రికెట్‌కు లభించిన సరికొత్త అస్త్రం విరాట్ కోహ్లీ. అతని కెప్టెన్సీలో భారత్ వరుసగా 18 టెస్టుల్లో విజయాలను నమోదు చేసింది. గతంలో ఎన్నడూ టీమిండియా టెస్టుల్లో ఇన్ని వరుస విజయాలను అందుకోలేదు. కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు ప్రపంచ టెస్టు ర్యాంకింగ్సులో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వనే్డ డ్రీమ్ టీమ్‌కు అతనే కెప్టెన్ కావడం విశేషం

రియో ఒలింపిక్స్‌లో పతకం దక్కుతుందా అని కోట్లాది మంది ఎదురుచూస్తున్న తరుణంలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాం స్య పతకంతో ఊరటనిచ్చింది. ఆమె ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో!

కేవలం 18 సంవ్సరాల వయసులోనే ప్రతిభావంతురాలైన గోల్ఫర్‌గా ఎదిగింది అదితి అశోక్. రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఆమె మనదేశంలో అంతగా పరిచయం లేని గోల్ఫ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో కృషి చేస్తున్నది

ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్ డ్రీమ్ రన్ కొత్త ఏడాదిలో కూడా కొనసా గుతుందని అభిమానులు గంపెడాశతో ఉన్నారు

భారత బాక్సింగ్ రంగానికి కొత్త దిశానిర్దేశనం చేయడానికి సమాఖ్య ఆవిర్భవించడం శుభసూచకం. నాలుగు సంవత్సరాలుగా భారత బాక్సింగ్‌కు సమాఖ్య లేదు. అంతర్జాతీయ బాక్సింగ్ మండలి నిషేధానికి గురైన తర్వాత, భారత బాక్సర్లు జాతీయ పతాకాన్ని ధరించి పోటల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు. సుమారు నాలుగేళ్లు సాగిన ఈ సమస్యకు తెరపడింది. భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) దేశానికి కొత్త బాక్సింగ్ సమాఖ్యగా మారింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య గుర్తింపు లభించడంతో బిఎఫ్‌ఐ కొత్త ఏడాదిలో విశిష్ట సేవలుఅందించడానికి సిద్ధమవుతున్నది

భారత బాక్సర్లు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకెళుతున్నారు. వికాస్ కిషన్ (ఎడమ) ప్రపంచ ర్యాంకింగ్స్ 75 కిలోల విభాగంలో 4వ స్థానాన్ని ఆక్రమించాడు. శివ థాపా (కుడి) 56 కిలోల విభాగంలో 7వ స్థానంలో ఉన్నాడు.