ఆటాపోటీ

కెప్టెన్సీ లేకున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఒరవడి
ధోనీ తన నాయకత్వ ప్రతిభతో భారత క్రికెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించాడు. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లను సౌరవ్ గంగూలీ ప్రోత్సహిస్తే, ధోనీ దానిని ఓ ఆనవాయితీగా మార్చేశాడు. అతని సహకారం, ప్రోత్సాహం లేకపోతే, రోహిత్ శర్మ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఎదిగి ఉండేవాళ్లు కారు. మైదానంలో దిగిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను శత్రువుల్లా చూసే విధానానికి తెరదించాడు. కెరీర్‌లో ఎన్నడూ అతను వివాదాల్లో చిక్కుకోలేదు. మైదానంలో ఎవరితోనూ ఘర్షణ పడలేదు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ఐసిసి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను గెలిచినప్పుడు కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, రన్నరప్ జట్టు ఆటగాళ్లతో కలిసిమెలసి ఉండే సంస్కారం ధోనీకి మాత్రమే సొంతం. కెప్టెన్‌గా ధోనీ వనే్డల్లో 54 సగటుతో 6,633, టి-20 ఫార్మాట్‌లో 1,112 చొప్పున పరుగులు చేశాడు. ఈ గణాంకాలు అతని బ్యాటింగ్ ప్రతిభకు అద్దం పడతాయి.

కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత కూడా జట్టులో ఆటగాడిగా అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నారు. 2003లో అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రానే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా కెప్టెన్సీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆల్‌రౌండర్ షాన్ పోలాక్‌కు జట్టును నడిపించే బాధ్యతను క్రికెట్ సౌతాఫ్రికా అధికారులు అప్పగించారు. అయితే, మూడేళ్లలోపే అతనిని తప్పించి, 22 ఏళ్ల ఓపెనర్ గ్రేమ్ స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తనను తప్పించినప్పటికీ దక్షిణాఫ్రికాకు పోలాక్ చాలాకాలం వెన్నుముకగా నిలిచాడు. 2008లో రిటైర్ అయిన తర్వాత కెరీర్‌ను కొనసాగించి అతను టెస్టుల్లో 143, వనే్డల్లో 125 చొప్పున వికెట్లు పడగొట్టి, కెప్టెన్సీ లేకపోయినా తాను జట్టుకు సేవలు అందించగలనని రుజువు చేశాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్‌ను కూడా కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత ఉత్తమ ప్రతిభ చూపిన వారి జాబితాలో చేర్చాలి. 2003లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు తర్వాత అతను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మైఖేల్ వాన్, ఆండ్రూ స్ట్రాస్ ఆ సిరీస్‌లో అతని తర్వాత కెప్టెన్లుగా వ్యవహరించారు. కాగా, నాయకత్వ బాధ్యతలను వదులుకున్న తర్వాత హుస్సేన్ 12 టెస్టులు ఆడాడు. ఆడినవి కొన్ని మ్యాచ్‌లే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా అతను బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. పరుగుల వరద పారించాడు. తన బ్యాటింగ్ సగటును గణనీయంగా పెంచుకున్నాడు. కెప్టెన్సీ ఊడిన తర్వాతే అతను నిజమైన బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడన్నది వాస్తవం.
సౌరవ్ గంగూలీదీ దాదాపుగా ఇదే కథ. ప్రతిభావంతులైన భారత క్రికెట్ కెప్టెన్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్న అతను 2005 సెప్టెంబర్‌లో జింబాబ్వే టూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే కెప్టెన్సీని పోగొట్టుకున్నాడు. కోచ్ గ్రెగ్ చాపెల్‌తో తలెత్తిన విభేదాలే అతనిని కెప్టెన్సీకి దూరం చేసింది. 2006 ఫిబ్రవరిలో అతను జట్టులో ఆటగాడిగా కూడా స్థానాన్ని కోల్పోయాడు. అదే ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో మొదలైన సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చాడు. 33 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఆతర్వాత రిటైరయ్యేలోపు అతను 1,991 పరుగులు సాధించాడు. ఆ స్కోరులో నాలుగు సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో అతను చివరిసారి 102, 85 చొప్పున పరుగులు చేసి, బ్యాట్స్‌మన్‌గా తన స్థానాన్ని రుజువు చేసుకున్నాడు. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో అతను టెస్టుల్లో సగటున 42.17 పరుగులు చేశాడు. కెప్టెన్సీని వదులుకున్న తర్వాత ఆడిన టెస్టుల్లో అతని సగటు 46.30 పరుగులు కావడం గమనార్హం.
పాకిస్తాన్‌ను ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న అసాధారణ ప్రతిభావంతుడు యూనిస్ ఖాన్. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్, మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా తనకు ఉన్న స్థానం ఏమిటో చాటిచెప్పాడు. అతని కెప్టెన్సీలో పాకిస్తాన్ 2009లో టి-20 ప్రపంచ కప్‌ను గెల్చుకుంది. 2009 నవంబర్‌లో, అబూదబీలో న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్ అనంతరం అతను కెప్టెన్సీని వదులుకున్నాడు. 2010 మార్చిలో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన పాక్ దారుణంగా విఫలమైంది. దీనికి బాధ్యుడ్ని చేస్తూ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అతనిని నిరవధికంగా క్రికెట్ నుంచి నిషేధించింది. అప్పటికే అతని వయసు 32 సంవత్సరాలు. దీనితో యూనిస్ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడిందనే అందరూ అనుకున్నారు. కానీ, వరుస వైఫల్యాలు పాకిస్తాన్ జట్టును వేధిస్తుంటే, యూనిస్‌కు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతను పాక్ టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పునరాగమనం తర్వాత అతను టెస్టుల్లో 4,593 పరుగులు సాధించాడు. మరెవరూ అందుకోలేని రీతిలో 56.01 సగటును నమోదు చేశాడు. ఇంకా పాక్ జట్టులో అతని స్థానం పదిలంగానే ఉంది.
న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రాస్ టేలర్‌ను అక్కడి క్రికెట్ బోర్డు అధికారులు ఎందుకు తొలగించారో ఎవరికీ అర్థం కాదు. 2013లో దక్షిణాఫ్రికా టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన వెంటనే అతనిపై అధికారులు వేటు వేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలమయ్యాడనో, కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించలేకపోతున్నాడనో అతను తన స్థానాన్ని కోల్పోలేదు. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 142, రెండో ఇన్నింగ్స్‌లో 74 చొప్పున పరుగులు సాధించాడు. కానీ, క్రికెట్ న్యూజిలాండ్ పాలక వర్గంలో తలెత్తిన విభేదాలు, ఆధిపత్యం పోరు టేలర్ పదవికి ఎసరుపెట్టింది. అయితే, కెప్టెన్సీని కోల్పోయిన తర్వాత టేలర్ మరింత బాగా ఆడుతున్నాడు. జట్టులో ఇప్పటికీ అతని స్థానం పదిలంగా ఉంది. టేలర్ లేని న్యూజిలాండ్ జట్టును ఊహించుకోవడం అక్కడి సెలక్టర్లకే భయం వేసే స్థాయిలో అతను గొప్పగా రాణిస్తున్నాడు. ప్రతిభావంతులకు కెప్టెన్సీ ఉన్నా, లేకున్నా ఒకటేనని నిరూపించడానికి ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే. ధోనీ కూడా వీరి మాదిరిగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత స్వేచ్ఛగా ఆడుతూ పరుగుల వరద పారించే అవకాశాలు లేకపోలేదు.

కీపర్ కెప్టెన్లలో టాపర్
వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తూనే జట్టుకు నాయకత్వం వహిస్తూ ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ధోనీ టాపర్. అతను ఈ ద్విపాత్రాభియనం చేస్తూ 6,633 పరుగులు సాధించాడు. 1,756 పరుగులతో కుమార సంగక్కర ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడాను చూస్తే, ధోనీ రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించే అవకాశమే లేదని స్పష్టమవుతుంది.
అంతర్జాతీయ వనే్డ టోర్నీల్లో భారత్ మొత్తం 11 పర్యాయాలు ధోనీ నాయకత్వంలో ఫైనల్ చేరింది. వాటిలో ఏడింటిలో విజయాలు సాధించగా, కేవలం నాలుగింటిని కోల్పోయింది. మహమ్మద్ అజరుద్దీన్ 19 ఫైనల్స్‌లో 11 విజయాలను సాధిస్తే, ఎనిమిది పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఈ విభాగంలో అజర్ కంటే ధోనీకే మంచి రికార్డు ఉంది.

ధోనీని టాప్ ఫినిషర్‌గా పేర్కోవచ్చు. ఎన్నో మ్యాచ్‌ల్లో అతను విన్నింగ్ షాట్లతో అలరించాడు. టి-20 ఫార్మాట్‌లో ధోనీ కెప్టెన్‌గా 12 పర్యాయాలు అజేయంగా క్రీజ్‌లో నిలిచి, జట్టును గెలిపించాడు. ఇది కూడా ఒక రికార్డే, జార్జి బెయిలీ ఐదు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ధోనీ ఖాతాలో విజయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం.