ఆటాపోటీ

టెన్నిస్‌బ్యూటీ ఫిట్నెస్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినందుకు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా మళ్లీ అంతర్జాతీయ సర్క్యూట్‌పై కాలు మోపేందుకు కసరత్తు చేస్తున్నది. ఫిట్నెస్ కోసం చెమటోడుస్తున్నది. గంటల తరబడి పరుగులు తీస్తూ, బాక్సింగ్ చేస్తూ కెరీర్‌ను కొనసాగించేందుకు మంచి షేపులో ఉండేందుకు శ్రమిస్తున్నది. నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్ సమయంలో డోపింగ్‌కు పాల్పడ్డానని ప్రకటించిన షరపోవా టెన్నిస్‌లోనేక యావత్ క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా జరిపిన డోప్ టెస్టులో దొరికిపోయానని చెప్పిన ఆమె, గత పది సంవత్సరాలుగా ‘మెల్డోనియం’ అనే మందును వాడుతున్నానని విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తెలిపింది. నిజానికి ‘మెల్డోనియం’ను నిషిద్ధ ఉత్ప్రేరకాల జాబితాలో చేరుస్తున్నట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ప్రకటించిన విషయం తనకు తెలియదని పేర్కొంది. నిషిద్ధ ఔషధాల జాబితాను అధికారులు పంపినప్పటికీ తాను చదలేదని అంగీకరించింది. వంశపారంపర్యంగా వస్తున్న షుగర్ వ్యాధిని నుంచి బయటపడడంతోపాటు ఆరోగ్యపరమైన మరికొన్ని సమస్యల కారణంగా తాను ‘మెల్డోనియం’ను వాడుతున్నట్టు చెప్పింది. కాగా, డోప్ పరీక్షలో విఫలమైన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) సస్పెండ్ చేసింది. ఆమెను టెన్నిస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాడా ఇచ్చే నివేదిక, ఉత్ప్రేరకాన్ని వాడిన సందర్భం అంశాలను పరిగణలోకి తీసుకొని సస్పెన్ష న్ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించారు. ఆరోగ్య సమస్యతోనే తాను ‘మెల్డోనియం’ను వాడుతున్నానని షరపోవా స్పష్టం చేయడం, నేరాన్ని అంగీకరించ డం, శిక్షను అనుభవిస్తానని చెప్పడం లాంటి అంశా లు విచారణ సమయంలో ఉపయోగపడ్డాయి.
శిక్షను తగ్గించిన సిఎఎస్
తనపై రెండేళ్ల సస్పెన్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ షరపోవా దాఖలు చేసిన పిటిషన్‌పై లాసనే్నలోని క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) సానుకూలంగా స్పందించింది. ఆమె శిక్షాకాలాన్ని 15 నెలలకు తగ్గించింది. మెల్డోనియంను వాడా నిషేధించిన విషయాన్ని తాను గమనించలేదని సిఎఎస్‌కు అందచేసిన తన పిటిషన్‌లో షరపోవా పేర్కొంది. గుండె జబ్బులతోపాటు సాధారణ రుగ్మతలకు వాడే వివిధ బ్రాండ్ల మందుల్లో మెల్డోనియం ఉంటుంది. నిన్నమొన్నటి వరకూ దీనిని నిషిద్ధ మాదక ద్రవ్యంగా ఎవరూ పేర్కోలేదు. ఈఏడాది జనవరిలో వాడా జారీ చేసిన నిషిద్ద మాదక ద్రవ్యాల జాబితాలో మెల్డోనియం కూడా చేరింది. కాగా, ఈ విషయంపై అవగాహన లేని చాలా మంది ఇప్పటికీ ఆ ఔషధాన్ని వాడుతున్నారు. ఇదే విషయాన్ని షరపోవా సిఎఎస్‌కు విన్నవించింది. ఆమె వాదనలో ఎంతో కొంత నిజం ఉన్నదని నమ్మిన సిఎఎస్ ఆమె శిక్షా కాలాన్ని 24 నెలల నుంచి 15 నెలలకు తగ్గించింది.