ఆటాపోటీ

రికార్డుల రారాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకొని, ఈ ఏడాది శుభారంభం చేసిన స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న క్రీడాకారుడిగా అతను తన రికార్డును తానే అధిగమిస్తున్నాడు. పీట్ సంప్రాస్, రాఫెల్ నాదల్ చెరి 14 టైటిళ్లతో ద్వితీయ స్థానంలో ఉంటే, వారి కంటే నాలుగు టైటిళ్లు అధికంగా సాధించిన ఫెదరర్ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. 1969 తర్వాత ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన ఆటగాడిగా అతని పేరు రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ ఫీట్‌ను అతను మూడుసార్లు (2206, 2007, 2009) సాధించాడు. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిచిన ఆటగాడు కూడా అతనే. మొత్తం 285 మ్యాచ్‌ల్లో ఫెదరర్ విజయాలను నమోదు చేస్తే, రాఫెల్ నాదల్ 195 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, తన కెరీర్‌లో ఇప్పటి వరకూ ఆడిన టోర్నీల్లో 25 శాతం టైటిళ్లను ఫెదరర్ కైవసం చేసుకున్నాడు. మరే ఇతర ఆటగాడికి ఈ ఘనత దక్కలేదు. 35 ఏళ్ల ఫెదరర్ సాధించిన రికార్డుల్లో కొన్ని..
* ఫెదరర్ ఏడు పర్యాయాలు వింబుల్డన్, ఐదుసార్లు యుఎస్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. పీట్ సంప్రాస్ కూడా ఈ రెండు టోర్నీల్లోనూ అతనితో సమానంగా టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. అయితే, సంప్రాస్ కెరీర్‌లో 14 టైటిళ్లు సాధిస్తే, ఫెదరర్ 18 టైళ్లతో ముందున్నాడు.
* ఫెదరర్ మరే ఇతర క్రీడాకారుడు సాధించలేని రీతిలో 29 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్ చేరాడు. 2005-2007 మధ్యకాలంలో అతను వరుసగా పది పర్యాయాలు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2008-2010 మధ్య అతను ఎనిమిది గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫైనల్స్ ఆడాడు.
* వింబుల్డల్‌లో అతను 2003 నుంచి 2009 వరకు వరుసగా ఏడుసార్లు వింబుల్డన్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. వీటిలో ఆరు విజయాలు సాధించాడు. 2008 ఫైనల్‌లో మాత్రమే అతను రాఫెల్ నాదల్ చేతిలో ఓడాడు. వింబుల్డన్‌లో వరుసగా ఎక్కువ ఫైనల్స్ ఆడిన ఆటగాడు అతనే.
* వరుసగా 15 సీజన్లలో కనీసం ఒక్క గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన ఏకైక ఆటగాడు ఫెదరర్. టెన్నిస్ చరిత్రలో మరెవరూ ఈ ఘనతను అందుకోలేదు.
* బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌ను 2015 జనవరిలో గెల్చుకోవడంతో, వరుసగా 14 సీజన్లలో ఆ టోర్నీని సాధించి ఇవాన్ లెండిల్ నెలకొల్పిన రికార్డును ఫెదరర్ 15 టైటిళ్లతో అధిగమించాడు.
* పురుషుల విభాగంలో 300 వారాలకుపైగా ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఒకే ఒక ఆటగాడు ఫెదరర్. ద్వితీయ స్థానంలో ఉన్న సంప్రాస్ 286 వారాలు నంబర్ వన్‌గా వెలిగాడు.
* మాస్టర్స్-1000 టోర్నీల చరిత్రలో ఒక్క సర్వీసు కూడా కోల్పోకుండా టైటిల్ సాధించిన ఆటగాడు ఫెదరర్. 2012 సిన్సినాటి టోర్నీలో మొదటి రౌండ్ నుంచి మొదలుపెట్టి, ఫైనల్ వరకూ అతను ఒక్క సర్వీసును కూడా చేజార్చుకోకుండా టైటిల్‌ను అందుకున్నాడు. ఇలాంటి ఘనతను అంతకు ముందుగానీ, ఆతర్వాత ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు.
* గ్రాస్ కోర్టులపై అత్యధిక విజయాలు నమోదు చేసిన టెన్నిస్ ఆటగాడిగా ఫెదరర్ పేరు చరిత్ర పుటల్లో చేరింది. జాన్ బోర్గ్ 41 విజయాలతో నెలకొల్పిన రికార్డును అతను 2007లో 42 మ్యాచ్‌లను గెల్చుకొని బద్దలు చేశాడు.
* ఎటిపి టూర్ మ్యాచ్‌ల్లో అతను 1,000 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఓపెన్ శకంలో అత్యధిక విజయాలను అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. జిమీ కానర్స్ (1,253), ఇవాన్ లెండిల్ (1,071) విజయాలతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
* ఎక్కువ దేశాల్లో ట్రోఫీలను గెల్చుకున్న ఆటగాడిగా కూడా ఫెదరర్ రికార్డుకెక్కాడు. 2015లో ఇస్టాంబుల్ ఓపెన్‌ను సాధించిన అతను, 19 వేరువేరు దేశాల్లో టైటిళ్లను అందుకున్న ఏకైక టెన్నిస్ స్టార్‌గా గుర్తింపు పొందాడు.