ఆటాపోటీ

నోటి దురుసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైఖేల్ స్లాటర్‌కు నోటి దురుసు ఎక్కువ. స్లెడ్జింగ్‌కు అతను అందరి కంటే ముందుంటాడు. 2001లో జరిగిన ముంబయి టెస్టులో అతని వైఖరి సర్వత్రా విమర్శలకు గురైంది. ‘ది వాల్’గా పేరుపొందిన రాహుల్ ద్రవిడ్ ఒక బంతిని పుల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది సరిగ్గా కనెక్ట్ కాలేదు. స్లాటర్ డైవ్ చేసి, బంతిని పట్టుకున్నాడు. తాను క్యాచ్ పట్టినట్టు అతను అప్పీల్ చేశాడు. కానీ, బంతి అప్పటికే నేలకు తగిలిందని నమ్మిన ద్రవిడ్ క్రీజ్ విడిచిపెట్టేందుకు నిరాకరించాడు. అంపైర్ వెంకటరాఘవన్ కూడా అప్పీల్‌ను తిరస్కరించాడు. ద్రవిడ్ అవుటయ్యాడన్న అప్పీల్ తిరస్కరణకు గురికావడంతో స్లాటర్ రెచ్చిపోయాడు. ద్రవిడ్‌ను తిట్టిపోశాడు. అంపైర్ వెంకటరాఘవన్‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ సంఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అతనిని తీవ్రంగా మందలించింది.