ఆటాపోటీ

పరుగుల యంత్రం సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ సచిన్ తెండూల్కర్. అతను ఆస్ట్రేలియాతో 39 టెస్టులు (74 ఇన్నింగ్స్) ఆడి 3,630 పరుగులు చేశాడు. 8 పర్యాయాలు నాటౌట్‌గా ఉన్న అతని అత్యధిక స్కోరు 241 (నాటౌట్). 11 శతకాలు, 16 అర్ధ శతకాలు సాధించాడు. నాలుగుసార్లు డకౌటయ్యాడు. కాగా, ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. అతను భారత్‌పై 28 టెస్టులు (51 ఇన్నింగ్స్) ఆడి, నాలుగు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, 2,555 పరుగులు చేశాడు. భారత్‌పై అతని అత్యధిక స్కోరు 257 పరుగులు. ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. మూడు పర్యాయాలు సున్నాకే అవుటయ్యాడు. మూడో స్థానం హైదరాబాద్ స్టయిలిస్ట్ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్‌కు దక్కుతుంది. అతను 29 టెస్టులు (54 ఇన్నింగ్స్) ఆడి, 2,434 పరుగులు చేశాడు. ఐదు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 281 అతని అత్యధిక స్కోరు. ఆరు సెంచరీలు, 12 అర్ధ శతకాలు నమోదు చేశాడు. మూడుసార్లు సున్నాకే వెనుదిరిగాడు. రెండు జట్ల మధ్య టెస్టుల్లో 2,000లకుపైగా పరుగులు చేసిన వారిలో రాహుల్ ద్రవిడ్, మైఖేల్ క్లార్క్ కూడా ఉన్నారు. ద్రవిడ్ 32 టెస్టులు (60 ఇన్నింగ్స్) ఆడి 2,143 పరుగులు చేశాడు. 233 అతని అత్యధిక స్కోరు, రెండు శతకాలు, 13 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. మూడుసార్లు నాటౌట్‌గా ఉన్నాడు. క్లార్క్ 22 టెస్టులు (40 ఇన్నింగ్స్) ఆడాడు. రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. 2,049 పరుగులు చేశాడు. 329 (నాటౌట్) భారత్‌పై అతని అత్యధిక స్కోరు. ఏడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు చేసిన అతను రెండుసార్లు డకౌటయ్యాడు.
సెంచరీల పరంగా చూస్తే సచిన్ 11, సునీల్ గవాస్కర్, రికీ పాంటింగ్ చెరి 8, మైఖేల్ క్లార్క్ 7, డేవిడ్ బూన్, విరాట్ కోహ్లీ, మాథ్యూ హేడెన్, వివిఎస్ లక్ష్మణ్ తలా 6 చొప్పున శతకాలు సాధించారు.
భారీ స్కోర్లు
భారత్, ఆసీస్ జట్ల మధ్య ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మైఖేల్ క్లార్క్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 2012 సిడ్నీ టెస్టులో అతను 468 బంతులు ఎదుర్కొని, 39 ఫోర్లు, ఆరు సిక్సర్లతో అజేయంగా 329 పరుగులు చేశాడు, (2012 జనవరిలో అడెలైడ్‌లో జరిగిన టెస్టులో క్లార్క్ 210 పరుగులు సాధించాడు). హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ 2001 మార్చిలో జరిగిన కోల్‌కతా టెస్టులో 452 బంతుల్లో 281 పరుగులు చేశాడు. ఈ స్కోరులో 41 ఫోర్లు ఉన్నాయి (2008 అక్టోబర్‌లో (్ఢల్లీ) అతను 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు). కాగా, రికీ పాంటింగ్ 2003 డిసెంబర్‌లో (సిడ్నీ) 458 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్ల సాయంతో 257 పరుగులు సాధించాడు. మరో రెండు సందర్భాల్లో అతను 242, 221 చొప్పున పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం రెండు వందల పరుగులు చేసిన ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (233), మహేంద్ర సింగ్ ధోనీ (224), జస్టిన్ లాంగర్ (223), సచిన్ తెండూల్కర్ (214), కిమ్ హ్యూస్ (213), డీన్ జోన్స్ (210), రవి శాస్ర్తీ (206), గౌతం గంభీర్ (206), గ్రెగ్ చాపెల్ (204), చటేశ్వర్ పుజారా (204), మాథ్యూ హేడెన్ (203), సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (201) ఉన్నారు.